వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ... ఢిల్లీ నిజాముద్దీన్ సభ ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా టెన్షన్ మొదలైంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన మత సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరు కావటంతో హాజరైన వారి కోసం గాలింపు సాగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సభకు వెళ్ళి వచ్చిన , కరోనా అనుమానితులను 90 మందిని గుర్తించిన అధికారులు ఇంకా ఈ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని అనుమానిస్తున్నారు..ఇందులో భాగంగానే వీరందరినీ ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. మిగిలిన వారికోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.

విజయవాడలో ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ కఠినతరం ... రీజన్ ఇదేవిజయవాడలో ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ కఠినతరం ... రీజన్ ఇదే

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మర్కజ్‌ కలకలం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మర్కజ్‌ కలకలం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మర్కజ్‌ కలకలం రేపుతోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మతపరమైన సభకు వెళ్లివచ్చిన వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని మండీ బజార్ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారిలో ఉన్నారు. ఇక వారిని గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు రమ్మంటే వారు నిరాకరిస్తున్నారు . . ఇప్పటికే కొందరిని గుర్తించి ఎంజీఎం ఐసోలేషన్‌కు తరలించగా, మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇంకా ఎవరైనా ఉంటే సమాచారమివ్వాలని అధికారులు కోరుతున్నారు.

 మండీ బజార్ నుండి పెద్ద సంఖ్యలో .. అధికారులకు సహకరించని మండీ బజార్ వాసులు

మండీ బజార్ నుండి పెద్ద సంఖ్యలో .. అధికారులకు సహకరించని మండీ బజార్ వాసులు

ఇక జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో ఒక మటన్‌ వ్యాపారికి కరోనా వైరస్‌ సోకింది. ఇతడు కూడా ఢిల్లీకి వెళ్లొచ్చినట్లు తేలింది. దీంతో గ్రామం మొత్తం నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మహబూబాబాద్‌ జిల్లాలోనూ 43 ఏళ్ల ఓ వ్యక్తికి వైరన్‌ సోకటంతో కలకలం రేగింది. మహబూబాబాద్‌ జిల్లాలో 6 మందిని గుర్తించగా ముగ్గురిని ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన 40 ఏళ్ల ఇక ఒక వ్యక్తి, పస్రాకు చెందిన 40 ఏళ్ల మరో వ్యక్తికి వైరన్‌ సోకినట్లు తేలింది. వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌‌గా తేలిందని తెలుస్తుంది .

వరంగల్ నగరంలో పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు

వరంగల్ నగరంలో పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు

ఇక మండీ బజార్ ప్రాంతంలో ప్రజలు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించకపోవటంతో మండీ బజార్ ప్రాంతాన్ని మూసివేసి మూడు కిలోమీటర్ల మేర నిషేధం విధించారు. వరంగల్‌ నగరంలోని మండిబజార్‌, చార్‌బౌళి ఎల్‌బీనగర్‌, నిజాంపుర, శంభునిపేట, రంగంపేటతో పాటు హన్మకొండలోని బొక్కలగడ్డ, అలంకార్‌, ఉజిలీబేస్‌ ప్రాంతాల నుంచి ఈ సదస్సుకు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 పాజిటివ్ కేసులు .. వరంగల్ రెడ్ జోన్ ?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 పాజిటివ్ కేసులు .. వరంగల్ రెడ్ జోన్ ?

ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా , మహబూబాబాద్ లో 1, ములుగులో 2, జనగామ 1 మొత్తం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదు కావటం స్థానికులకు టెన్షన్ పెడుతుంది . వీరంతా ఢిల్లీ సభలకు వెళ్ళి వచ్చిన వారే కావటం విశేషం . ఇప్పటికే ఢిల్లీ తబ్లీఘీ జమాత్ కు వెళ్ళి వచ్చిన 90 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వరంగల్ కమీషనరేట్ పరిధిలో క్వారంటైన్ నిబంధనలు మరింత కఠినతరం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . వరంగల్ నగరాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది .

English summary
There are 23 positive cases registered in the Joint Warangal district which causes tension to the locals. It is remarkable that they all went to Delhi. Around 90 family members who have already moved to Delhi Tablighi Jamaat are being tested and transported to Quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X