వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి .. అసహనం వ్యక్తం చేస్తున్న ఎంపీలు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణా రాష్ట్రంలో అసహనం వ్యక్తం అవుతుంది. తెలంగాణాకు బడ్జెట్ లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని తెలుస్తుంది. కేంద్రం తెలంగాణాకు మొండి చెయ్యి ఇచ్చిందనే భావన వ్యక్తం అవుతుంది . తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్న కనీస కేటాయింపులు కూడా లేకుండా కేంద్ర బడ్జెట్ ఉందని తెలంగాణా రాష్ట్ర ఎంపీలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపోల్స్ కు రంగం సిద్ధం .. బ్యాలెట్ వైపే మొగ్గు .. ఆగస్ట్ లో ఎన్నికలు?మున్సిపోల్స్ కు రంగం సిద్ధం .. బ్యాలెట్ వైపే మొగ్గు .. ఆగస్ట్ లో ఎన్నికలు?

ఏ రాష్ట్రానికీ ఉపయోగం లేని బడ్జెట్ అన్న టీఆర్ఎస్ ఎంపీలు .. తెలంగాణాలోని పథకాలే కాపీ చేశారని ఎద్దేవా

ఏ రాష్ట్రానికీ ఉపయోగం లేని బడ్జెట్ అన్న టీఆర్ఎస్ ఎంపీలు .. తెలంగాణాలోని పథకాలే కాపీ చేశారని ఎద్దేవా

ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పెదవి విరిచారు. ఏ రాష్ట్రానికీ ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. అసలు ఈ బడ్జెట్ లో ప్రజలకు మేలు చేసే ప్రకటనలు ఏమీ లేవని పేర్కొన్నారు . ప్రతి ఇంటికి తాగు నీరు అందించేందుకు కేటాయింపులు చేయడం సంతోషకరమని చెప్తూనే ఇప్పటికే ఆ పథకాన్ని మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక కేంద్ర సర్కార్ తమ పథకాన్నే కాపీ కొట్టి పేరు మార్చి బడ్జెట్ లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీకి బడ్జెట్లో ప్రతిపాదనలు లేవని ఎంపీలు మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని అన్నారు.

తెలంగాణాకు ఏ మాత్రం పనికి రాని బడ్జెట్ ..అన్న ఎంపీలు

తెలంగాణాకు ఏ మాత్రం పనికి రాని బడ్జెట్ ..అన్న ఎంపీలు

టీఆర్ఎస్ మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు ఆర్థికసాయం చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. బంగారంపై సుంకాన్ని పెంచారని, ఇంధన ధరలపై స్వల్ప సుంకాలు పెంచనున్నట్లు వెల్లడించారని, లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఒక్క రూపాయి చొప్పున సెస్ విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఇంధన ధరలు పెరగనున్నాయి. దీని వల్ల సామాన్యులకు ఇబ్బంది అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బడ్జెట్ ఉందని చెప్పారు.

 కేంద్ర బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌ .. ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం చేస్తాం అన్న ఎంపీ కోమటిరెడ్డి

కేంద్ర బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌ .. ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం చేస్తాం అన్న ఎంపీ కోమటిరెడ్డి


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌గా కోమటిరెడ్డి అభివర్ణించారు.ఈ బడ్జెట్ లోఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల ప్రస్తావన లేదన్నారు. గత ఐదేళ్లు కేసీఆర్‌ మోదీ భజన చేశారని అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు . రైతుల గురించి కనీసం పట్టించుకోలేదని పేర్కొన్న ఆయన గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదని పేర్కొన్నారు. ఇక గేమ్స్‌కు నిధులు కేటాయించలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు . వ్యక్తిగత కారణాలవల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం దారుణమని పేర్కొన్నారు. బడ్జెట్ లో తెలంగాణాకు జరిగిన అన్యాయం మీద పార్లమెంట్ లోపల, బయట కూడా ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

English summary
Telangana state is embarrassed over the budget introduced by the central government. Telangana seems to have no significant allocations in the budget. The notion that the Center has given Telangana its cynicism. Telangana state MPs are disappointed that the Union Budget is without even the minimum allocations awaiting the people of Telangana. the central budget was Telangana's anti-state budget MPs stated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X