• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవితకు బర్త్ డే గిఫ్ట్ లేనట్టేనా ? కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై డైలమా !!

|

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు రేపు .. బిడ్డకు బర్త్ డే గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇస్తారని కవిత అభిమానులు భావించినా సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులుగా కేశవరావు , దామోదర్ రావుల పేర్లను ఖరారు చేసి కవిత ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కవిత రాజకీయ భవిష్యత్ విషయంలో ఇంకా ఏమీ ఫైనలైజ్ చెయ్యని సీఎం కేసీఆర్ బిడ్డ కవితకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వకుండా నిరాశ పరిచారు. దీంతో సీఎం కేసీఆర్ తన కుమార్తె కవిత రాజకీయ భవిష్యత్ విషయంలో పార్టీ శ్రేణుల్లో డైలమా నెలకొంది.

కవితను రాజ్యసభకు పంపని కేసీఆర్

కవితను రాజ్యసభకు పంపని కేసీఆర్

తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ ఖాయం అన్నారు.. అభ్యర్ధిత్వం ఖరారు చేయడమే తరువాయి అంటూ ప్రచారం చేశారు.. అది కాకపోతే స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ పక్కా అన్నారు. కానీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి మరోసారి బ్రేక్ పడింది. రాజ్యసభ చేజారింది. రాజ్య సభ సభ్యులుగా సీఎం కేసీఆర్ కేశవరావు, దామోదర్ రావుల పేర్లు ఖరారు చెయ్యటం, అలాగే ఎమ్మెల్సీ స్ధానం మరొకరికి ఖరారు కావటంతో కవిత రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుంది అన్న అనుమానం కలుగుతుంది.

ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్ ..టీఆర్ఎస్ రాజ్య సభ అభ్యర్థులు వీరే

నిరాశలో కవిత ఫ్యాన్స్

నిరాశలో కవిత ఫ్యాన్స్

అక్క రావాలి, వస్తుందని ఆశపడ్డ కవిత శ్రేణులకు మరోసారి నిరాశ ఎదురైంది. రాష్ట్ర రాజకీయాలలో పరిచయం అక్కరలేని నాయకురాలు అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఐదేళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా తనదైన స్థానం సంపాదించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహారించి అభివృద్దిని పరుగులు పెట్టించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం, అందుకు సొంత పార్టీ నేతలే కారణం అని భావించిన ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కవితక్క రావాలి .. కవితక్క కావాలి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా

కవితక్క రావాలి .. కవితక్క కావాలి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా

నిజామాబాద్ కు రాకుండా.. హైదరాబాద్ లో ఎవరికి అందుబాటులో లేకుండా తెరమరుగయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఐతే కొద్ది రోజులుగా ఆమె అనుచరులు కవితమ్మ మళ్లీ యాక్టివ్ అవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు .కవితక్క రావాలి .. కవితక్క కావాలి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్ధానాల్లో ఓ స్ధానం కవితకు రిజర్వ్ అయ్యిందని ప్రచారం సైతం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కవితకు రిజర్వ్ అయ్యిందనుకున్న రాజ్యసభ చేజారింది .

ఎమ్మెల్సీగా కూడా కవితకు నో ఛాన్స్

ఎమ్మెల్సీగా కూడా కవితకు నో ఛాన్స్

ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అనర్హతతో ఖాళీ అయిన.. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఎన్నికై కవిత రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని మరో దశలో పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే ఆ ఛాన్స్ కుడా మిస్సయ్యిందని తెలుస్తుంది . అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కవితనే ఆ రెండు పదవులకు పెద్దగా పట్టుబట్టలేదని సమాచారం. దీంతో నిన్నటి వరకు కవితక్క రావాలి.. కవితక్క కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, స్టేటస్ లు పెట్టిన ఆమె అనుచరులు ఒక్కసారిగా డీలా పడ్డారు .

రాజ్యసభకు , ఎమ్మెల్సీగా కూడా నో చెప్పిన కవిత

రాజ్యసభకు , ఎమ్మెల్సీగా కూడా నో చెప్పిన కవిత

కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాఫిక్ గా మారింది. రాజ్యసభ ఆశించిన జాబితాలో కవిత పేరు ప్రముఖంగా వినపడ్డా.. ఆమె మాత్రం ససేమిరా అన్నారని సమాచారం . జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నా ప్రజలతో ఎన్నుకోబడ్డ పదవిని స్వీకరించాలని అనుకుంటున్నారని తెలుస్తుంది . ఏ ప్రజల నుండి వద్దని చెప్పారో, ఆ ప్రజలే తనను కావాలని కోరుకోవాలని కవిత భావిస్తున్నారని , ఎన్నికల ద్వారానే ఎన్నిక కాబడాలని అనుకుంటున్నారని అందుకే రాజ్యసభ ఆమె వద్దని ఆమె తిరస్కరించారనే టాక్ నడుస్తోంది.

సామాజిక సమీకరణాల నేపధ్యంలో మంత్రి పదవి కష్టమే

సామాజిక సమీకరణాల నేపధ్యంలో మంత్రి పదవి కష్టమే

ఇక ఎమ్మెల్సీ పదవికి సైతం ఆమె అయిష్టత చూపారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా రాజకీయంగా యాక్టివ్ కావాలని అనుకున్నా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకే సామాజికవర్గం నుంచి మంత్రి పదవుల్లో ఉండగా కవితకు మంత్రి పదవి రావడం అంత సాధ్యం అయ్యే పని కాదని సైలెంట్ అయ్యారని సమాచారం .

కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై సస్పెన్స్

కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై సస్పెన్స్

కవిత రాజ్యసభతో రీఎంట్రీ ఇస్తుందని భావిస్తే అది కూడా జరగలేదు . ఇక ఎమ్మెల్సీగా ఛాన్స్ కష్టమే అని తెలుస్తుంది. ఆమె ఆసక్తి కూడా చూపించటం లేదని తెలుస్తుంది. ఇక రేపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు గిఫ్ట్ ఇస్తారని భావిస్తే అలాంటిదేమీ లేదని తేల్చెయ్యటం కవిత ఫ్యాన్స్ కు షాక్ . ఏది ఏమైనా కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు అనేది మరోసారి డైలమాలో పడింది .

English summary
Telangana Chief Minister KCR daughter Kavitha's birthday tomorrow .. Kavitha fans have been thought that the Rajya Sabha seat has given to kavitha as a birthday gift to the daughter by cm kcr , but CM KCR Rajya Sabha candidates have finalized the names of Kesavarao and Damodar Rao shocked Kavitha fans. The political future of the kavitha is now in dilemma. This has led to the dilemma of the party lines with regard to the political future of CM KCR's daughter Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more