వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికే దిక్కు లేదు, పవన్‌ను ఎవరు పట్టించుకొంటారు: విజయశాంతి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిరంజీవికేదిక్కులేదు, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయమై పవన్ పోరాటం చేయాలని విజయశాంతి పవన్ కళ్యాణ్‌కు సూచించారు.

అసెంబ్లీలో అడుగుపెడతా,అప్పుడు తెలుస్తుంది: పవన్ కళ్యాణ్అసెంబ్లీలో అడుగుపెడతా,అప్పుడు తెలుస్తుంది: పవన్ కళ్యాణ్

శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి మీడియాతో చిట్ చాట్ చేశారు.కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో రానున్న రోజుల్లో కీలకంగా వ్యవహరించనున్నట్టు ఆమె ప్రకటించారు.

జనసేనలోకి కీలక నేతలు: పవన్ గ్రీన్ సిగ్నల్,చర్చలుజనసేనలోకి కీలక నేతలు: పవన్ గ్రీన్ సిగ్నల్,చర్చలు

పార్టీ అధిష్టానం సూచన మేరకు నడుచుకొంటానని విజయశాంతి ప్రకటించారు. కెసిఆర్‌పై విజయశాంతి విమర్శలు గుప్పించారు.తెలంగాణ సీఎం కెసిఆర్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించడాన్ని ఆమె ప్రస్తావించారు. అవసరాల కోసమే ఇలా మాట్లాడుతున్నారే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

చిరంజీవికే దిక్కులేదు, పవన్ ను ఎవరు పట్టించుకొంటారు

చిరంజీవికే దిక్కులేదు, పవన్ ను ఎవరు పట్టించుకొంటారు

తెలంగాణలో చిరంజీవికే దిక్కులేదు, పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ ఏపీ రాష్ట్రంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్‌కు విజయశాంతి సూచించారు.తెలంగాణ సీఎం కెసిఆర్‌, పవన్ కళ్యాణ్‌లు గతంలో ఎలా విమర్శించుకొన్నారో ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రస్తుతం ప్రశంసలు కురిపించుకోవడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. అవసరాల కోసమే ఇద్దరు కలిసిపోయారనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేసే అవకాశం ఉందని విజయశాంతి చెప్పారు.

రాహుల్ పోటీ చేయాలని కోరారు

రాహుల్ పోటీ చేయాలని కోరారు

2019 ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావించానని విజయశాంతి చెప్పారు. కానీ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గా:దీ తనను పోటీ చేయాలని కోరారని విజయశాంతి చెప్పారు. పార్టీలో తన పాత్ర ఏంటనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తోందని విజయశాంతి చెప్పారు.కావాలనే గ్యాప్ తీసుకొన్నట్టు చెప్పారు. రాజకీయాల్లో త్వరలోనే యాక్టివ్ కానున్నట్టు విజయశాంతి చెప్పారు.

కెసిఆర్ ది ఓవర్ కాన్పిడెన్స్

కెసిఆర్ ది ఓవర్ కాన్పిడెన్స్

తెలంగాణ సీఎం కెసిఆర్‌ది ఓవర్ కాన్పిడెన్స్ అని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఏ విషయాన్ని కూడ సీరియస్‌గా తీసుకోరని విజయశాంతి చెప్పారు. బంగారు తెలంగాణ కాదని, ఇత్తడి తెలంగాణ అంటూ కెసిఆర్ పాలన తీరును విజయశాంతి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కెసిఆర్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కెసిఆర్‌కు తేడా ఉందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కకు పెట్టారని ఆమె విమర్శించారు.

2009లోనే కెసిఆర్ నాకు టిక్కెట్టు ఇవ్వొద్దనుకొన్నారు

2009లోనే కెసిఆర్ నాకు టిక్కెట్టు ఇవ్వొద్దనుకొన్నారు

2009 ఎన్నికల్లోనే తనకు కెసిఆర్ టిఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వొద్దని భావించారని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి చెప్పారు. పార్టీకి చెందిన నేతలంతా తనకు టిక్కెట్టు ఇవ్వాలని కోరిన మీదటే చివరికి కెసిఆర్ టిక్కెట్టు ఇవ్వక తప్పలేదని విజయశాంతి చెప్పారు.జయశంకర్ సూచన మేరకే తాను తన పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేసినట్టు విజయశాంతి గుర్తు చేసుకొన్నారు.

ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు

ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు

తెలంగాణ సాధన కోసం పోరాటం చేసినవారిని కాదని, ఇతరులను కెసిఆర్ అక్కున చేర్చుకొంటున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రశ్నిస్తే జైల్లో పెట్టడమే కెసిఆర్ పనిగా పెట్టుకొన్నారని ఆమె చెప్పారు. మందకృష్ణ మాదిగ, కోదండరామ్‌లను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంత కాలం పాటు టిఆర్ఎస్‌కు సమయమివ్వాలనే ఉద్దేశ్యంతోనే తాను మాట్లాడలేదని విజయశాంతి చెప్పారు.

English summary
Congress leader former Mp Viajayashanthi said that there is no chance to Pawan Kalyan in Telangana state. Vijayashanthi chit chat with media on Thursday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X