వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా సంప్రదింపులు, సభ నుంచి బీజేడీ వాకౌట్, టీఆర్ఎస్‌పై సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే, శివసేన వైఖరిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అవిశ్వాస తీర్మానం తర్వాత ఓటింగ్‌కు దూరంగా ఉండాలని శివసేన పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. సభ ప్రారంభంలోనే బీజేడీ వాకౌట్ చేసింది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.

నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?

ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేయాలని లేదంటే ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని కోరుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కూడా అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్ని పార్టీల నేతలను కోరారు. ఇరు పార్టీలు తమ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

No Confidence Motion: BJD Stages Walkout, Shiv Sena to Abstain from Voting, What TRS will do?

బీజేపీ వైపు ఏ పార్టీలు, టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీ వైపు అంటే.. అవిశ్వాసానికి అనుకూలంగా ఏ పార్టీలు ఉన్నాయో దాదాపు తేలిపోయింది. కానీ శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే పార్టీల వైఖరి అస్పష్టంగా ఉంది. శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తాజాగా శుక్రవారం నిర్ణయం తీసుకుంది. శివసేన నిర్ణయం బీజేపీ కంటే టీడీపీకే పెద్ద దెబ్బ. ఎందుకంటే గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న ఆ పార్టీ అవిశ్వాసానికి మాత్రం మద్దతివ్వకపోవడం గమనార్హం.

ఇక, టీఆర్ఎస్ కూడా అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అన్నాడీఎంకే కూడా అదే వైఖరి అవలంభిస్తాయా.. లేక అనూహ్య నిర్ణయం తీసుకుంటాయా అనేది సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది. పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే అది టీడీపీ కంటే బీజేపీకి ప్లస్.

English summary
Biju Janata Dal (BJD) has staged a walkout as the Lok Sabha is in session for motion of no confidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X