మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌తో స్టీఫెన్ సన్‌ ఫోటోలు: ఫాంహౌస్ వద్దకు మీడియాకు నో ఎంట్రీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అల్లం సాగుపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎరవలిలోని తన ఫాం హౌస్‌కు చేరుకున్నారు. గురువారం కూడా ఆయన రోజంతా అక్కడే గడిపారు.

అయితే తొలిరోజు ఓటుకు నోటు వ్యవహారంలో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కలిసి తిరిగారు. ఈ ఫోటోలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్‌పై విపక్షాలన్నీ విరుచుపడ్డాయి.

అంతేకాదు ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తికి కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం పని? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాయి. మరోవైపు బుధవారం ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తనను కలిసిన విషయం, ఫోటోలు పత్రికలలో రావడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

No entry for media at KCR Farmhouse

ఆ ఫోటోలు ఎలా వచ్చాయి, మీడియాను లోపలికి ఎవరు రానిచ్చారని సిబ్బందిని ప్రశ్నించిన సీఎం ఫాంహౌస్ పరిసరాల్లోకి
మీడియాను అనుమతించవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు. దీంతో పోలీసులు బందో బస్తు చర్యలు చేపట్టారు.

జర్నిలిస్టులు, కెమెరామెన్‌లను 2 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకుని వెనక్కి పంపించారు. సమీప గ్రామాల వారిని సైతం గుర్తింపు కార్డులను పరిశీలించాకే లోపలికి అనుమతించారు. కాగా, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న మినీ బస్ అసోసియేషన్ ప్రతినిధులను పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకుని తిప్పి పంపించారు.

English summary
No entry for media at KCR Farmhouse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X