వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవిఎమ్ వద్దు, బ్యాలట్ ముద్దు,

|
Google Oneindia TeluguNews

ఈవిఎమ్ ల వాడకంపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి,రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈవిఎమ్ లు వద్దు, బ్యాలెట్ పేపరు ముద్దంటూ మరోసారి ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.మూడు నెలలకే ప్రభుత్వ వ్వతిరేకత బయటపడుతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు పార్టీ నాయకులు

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్,

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్,

తెలంగాణలో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో టిఆర్ఎస్ చీఫ్ చెప్పిన విధంగా టార్గెట్ రీచ్ అయ్యారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి, సిఎమ్ కేసిఆర్ తోపాటు ఆపార్టీ నాయకులు వంద సీట్లు దాటుతాయి అని ఖచ్చింతంగా చెప్పారు.దీంతో ఆ పార్టీ అనుకున్నట్టుగానే 88 సీట్ల మార్కు దాటి మరో ఇద్దరు ఇండిపెండెంట్ లను కూడ గెలిపించుకున్నారు..ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు ,బిజేపిలో పలుసార్లు ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేతలు సైతం ఓటమిని చవిచూశారు.

2018 అసెంబ్లి ఎన్నికల్లో కనీసం 40 సీట్లు గెలుస్తామని భావించిన కూటమి,

2018 అసెంబ్లి ఎన్నికల్లో కనీసం 40 సీట్లు గెలుస్తామని భావించిన కూటమి,

అయితే అంతకుముందు ప్రతి పక్షపార్టీలైన కాంగ్రెస్ కూటమీకి అధికారంలోకి వస్తుందని ప్రచారం జరిగింది. కనీస సీట్లతో కాంగ్రెస్ కూటమి వస్తుందని విపరీత నమ్మకంతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అంచనాలన్ని తలకిందులయ్యాయి. తీర ఎన్నికల ఫలితాలపై తెరుకున్న కాంగ్రెస్ పార్టీ ఈవిఎమ్ లలో ఏదో మాయ జరిగిందని ఆరోపణలు చేశారు.ప్రభుత్వం ఈవిఎమ్ మిషన్లను ఉపయోగించి గెలుపోందిందని ఆరోపించారు.దీనికి తోడు వీవీ ప్యాట్ స్లిప్ లెక్కింపులో సైతం గోల్ మాల్ జరిగిందని కూడ వారు ఆరోపించారు..మరోవైపు ఓ వైపు కోర్టులో ఉన్నా ఈవిఎమ్ లతోపాటు వీవీప్యాట్ లను ఖాలీ చేసినందుకు హైద్రబాద్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి సైతం సస్పెండ్ అయిన విషయం తెలిసిందే...దీనిపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆందోళనే కొనసాగించింది.

ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ,

ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ,

ఇక తాజాగా అసెంబ్లి ఎన్నికలు జరిగిన మూడు నెలలకే బ్యాలెట్ పేపర్ ద్వార ఎన్నికల జరిగిన ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపార్టీ సపోర్ట్ చేసిన ఉపాధ్యాయ ,పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. నల్గోండ, వరంగల్ ,ఖమ్మం తోపాటు కరీంనగర్ ,మెదక్ ,నిజామాద్ ,ఆదిలాబాద్ , ఎమ్మెల్సి స్థానాలకు జరిగిన మూడు స్థానాల్లో ఈ పరిస్థితి కొనసాగింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్

పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్

ఎమ్మెల్సి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మరోసారి ఈవిఎమ్ లపై అనుమానాలు రేకెత్తేయాయి, గత ప్రభుత్వం ఈవీఎమ్ ట్యాంపరింగ్ ద్వార అధికారంలోకి వచ్చిందంటూ ప్రతి పక్ష పార్టీలు మళ్లి అరోపిస్తున్నాయి..దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈవిఎమ్ లకు బదులుగా బ్యాలెట్ పేపర్ ను ఉపయోగించాలనే డిమాండ్ ఊపందుకుంది.

వీవీ ప్యాట్ లను ఎందుకు లెక్కించడం లేదు; సుప్రిం కోర్టు

వీవీ ప్యాట్ లను ఎందుకు లెక్కించడం లేదు; సుప్రిం కోర్టు

ఈనేపథ్యంలోనే వీవీ ప్యాట్ ల లెక్కింపు పై కూడ 21 పార్టీలతో కూడ కూటమీ సుప్రిం కోర్టును అశ్రయించింది.దీంతో వీవీ ప్యాట్ ల లెక్కింపుల్లో ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలియజేయాలని,వాటిని 50 శాతం మేర లెక్కించాలని ఈసికి సుప్రిం కోర్టు డైరక్షన్ ఇచ్చింది.

నిరూపించుకోవాల్సింది ఈసినే

నిరూపించుకోవాల్సింది ఈసినే

ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా ఈవిఎమ్ ట్యాంపరింగ్ లపై వస్తున్న వార్తలకు ఈసి ఫుల్ స్టాప్ పెట్టాలి.వీటి వాడకంపై ప్రజలకు ప్రత్యక్షంగా నమ్మకం చేకూర్చే విధంగా ఉండాల్సిన భాద్యత ఈసిదే,

English summary
The EVMs have repeatedly raised doubts, as opposition parties once again argue that the ballot papers are overturned,result of resent teacher and graduate mlc elections in telangana,anti to govt Using the ballot paper, the results of the election have been overturned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X