హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాం నిధుల బదలాయింపు తెలియదు: కేంద్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అరవై ఏడేళ్ల నాటి హైదరాబాద్ నిధుల బదలాయింపు కేసుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1948లో ఇంగ్లాండులోని ఒక బ్యాంకులో నిలువ ఉన్న హైదరాబాద్ నిజాం తాలూకు పదిలక్షల పౌండ్ల (రూ.288 కోట్లు) మొత్తాన్ని లండన్‌లోని నాటి పాకిస్తాన్ హైకమిషనరు ఖాతాలోకి బదలాయించిన విషయమై సమాచార హక్కు కింద దరఖాస్తు దాఖలైంది.

దీనిపై కేంద్రం జవాబు ఇచ్చింది. అక్బర్ అలీఖాన్ అనే వ్యక్తి ఈ సమాచార హక్కు దరఖాస్తును దాఖలు చేశారు. 1948 సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన ఈ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డుల ప్రతులను ఆయన అడిగారు.

No files on Nizam cash says Centre

దీనిపై న్యాయశాఖ జవాబిస్తూ తమ వద్ద అలాంటి రికార్డులేవీ లేవని చెప్పింది. దీనిపై సీఈసీ స్పందిస్తూ... ఈ కేసుకు సంబంధించిన లావాదేవీలు, సంప్రదింపుల సమాచారం ఏదైనా ఉంటే వెల్లడించాలని తాజాగా విదేశీ
వ్యవహారాలను ఆదేశించింది.

2008లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేస్తూ నిజాం సంపదకు సంబంధించిన విషయంలో పాకిస్తాన్ దేశంతో న్యాయస్థానం వెలుపల పరిష్కారానికి నాటి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్కొనడం గమనార్హం.

English summary
The Centre has said that it has no records of the six-decade-old Hyderabad Funds case in which over a million pounds of the Nizam’s wealth was transferred to the then High Commissioner of Pakistan in London in 1948.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X