వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇంకా పత్రాలు ఇవ్వలేదు, హైదరాబాద్ బిర్యానికి జిఐఆర్ గుర్తింపు లేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జిఐఆర్ (భౌగోళిక సూచీ నమోదు కేంద్రం) కింద హైదరాబాద్ బిర్యానీ ఇఫ్పటి వరకు నమోదు కాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు వెల్లడించారు. హైదరాబాద్ బిర్యానీకి జిఐఆర్ గుర్తింపు కోరుతూ 2009 జూలై 28వ దతేదీన దరఖాస్తు నమోదయిందని తెలిపారు.

హైదరాబాద్ బిర్యానీకి జిఐఆర్ గుర్తింపు ఇప్పటి వరకు లేదని నిర్మలా సీతారామన్ లోకసభలో వెల్లడించారు. 2010 సెప్టెంబర్ 5, 2013 ఏప్రిల్ 28 తేదీల్లో జరిగిన సంప్రదింపుల బృంద సమావేశాల్లో వాటిని ప్రభుత్వం చట్టం ప్రకారం పరిశీలించినట్లు చెప్పారు.

No gir identification to hyderabad biryani

అయితే, ప్రభుత్వం కోరిన ఇతర పత్రాలను దరఖాస్తుదారుడు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఇంకా హైదరాబాద్ బిర్యానీకి జిఐఆర్ గుర్తింపు రాలేదన్నారు. టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోకసభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై: స్మృతి ఇరానీ

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్రం సోమవారం ప్రకటించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా యూనివర్సీటీల్లో వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోకసభలో తెలిపారు.

English summary
No gir identification to hyderabad biryani, says Niramala Sitaraman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X