వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణ

|
Google Oneindia TeluguNews

దేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ్రెసేతర శక్తులను కూడగట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం 'నయా భారత్' పేరుతో జాతీయ పార్టీని నెలకొల్పబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు మీడియాలో హల్ చల్ చేస్తోన్న సదరు వార్తలపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్‌లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్‌లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్

అందరికీ చెప్పే పెడతా..

అందరికీ చెప్పే పెడతా..

కొత్తగా జాతీయ పార్టీ పెట్టే ఆలోచన ఏమి లేదని, ఒకవేళ పెట్టాలనుకుంటే అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నయా భారత్' పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టబోతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోన్న ప్రచారంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నయా భారత్, గియా భారత్ ఏమీ లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మొద్దు. సోషల్ మీడియా ఇప్పుడు యాంటీ సోషల్ మీడియాగా మారింది'' అని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ ప్లాప్..

కాంగ్రెస్, బీజేపీ ప్లాప్..

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో తీసుకురాబోయే కొత్త రెవిన్యూ చట్టం, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా సీఎం మాట్లాడారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, అయితే ఇప్పటికిప్పుడు జాతీయ పెట్టే ఆలోచనేదీ తనకు లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

బుధవారమే కొత్త రెవెన్యూ చట్టం..

బుధవారమే కొత్త రెవెన్యూ చట్టం..

రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్ సర్కారు.. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించడం, మరోవైపు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తిగా నిలిపేయం తెలిసిందే. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం తహశీల్దార్ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేసన్లు జరుగనున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని, కొత్త చట్టంతో భూకబ్జాల విషయంలో దాదాగిరీ నడవదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్లును బుధవారమే అసెంబ్లీలో ప్రవేశపెడతామని టీఆర్ఎల్ ఎల్పీ భేటీలో స్పస్టం చేశారు.

దుబ్బాకలో లక్ష.. గ్రేటర్‌లో వంద

దుబ్బాకలో లక్ష.. గ్రేటర్‌లో వంద

సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలసిందే. బీహార్ సాధారణ ఎన్నికలతోపాటే దుబ్బాక ఉప ఎన్నికనూ నిర్వహిస్తామనీ ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. సోమవారం నాటి ఎల్పీ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ఇప్పటికే గ్రేటర్ లో నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వెల్లడైందని, గ్రేటర్ లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశమే లేదని, బీజేపీ ప్రభావం కూడా నామమాత్రమేనని కేసీఆర్ చెప్పారు. ఈసారి గ్రేటర్ లో గులాబీ పార్టీ 100కు పైగా స్థానాలు కైవసం చేసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

Recommended Video

TRS Should Include COVID Treatment under Aarogyasri : TDP

కేసీఆర్ జాతీయ పార్టీని జగన్ అంగీకరించరు - పెడితే నవ్వులపాలే - విపక్ష నేతల విసుర్లుకేసీఆర్ జాతీయ పార్టీని జగన్ అంగీకరించరు - పెడితే నవ్వులపాలే - విపక్ష నేతల విసుర్లు

English summary
telangana chief minister kcr clarified that he has no idea to form a new national party. while speaking at trslp meeting on monday, kcr responded to news coming in on the National Party. he urged partymen not to believe rumors. new revenue act, dubbak by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X