హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంజాన్: స్పెషల్ హలీం కోసం పిస్తా హౌజ్ సిద్ధం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కారించుకుని పిస్తా హౌస్ ప్రత్యేకంగా తయారు చేసే హలీం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 కౌంటర్లలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ మాజిద్ ప్రకటించారు. గురువారం పాతబస్తీలోని ఆజం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రంజాన్ మాసంలో నాణ్యతతో పాటు, అన్ని పోషక పదార్థాలతో హలీంను మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. మాంసాహారంతో పాటు శాకాహార హలీంను కూడా విక్రయిస్తున్నట్లు తెలిపారు.

గత 17 ఏళ్లుగా హలీం విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. పిస్తాహౌస్‌కు ఇప్పటికి దాదాపు 200 అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ముస్లింలతో పాటు వివిధ వర్గాల నుంచి హలీంకు ఆదరణ పెరుగుతోందన్నారు.

దూర ప్రాంతాలకు విమానం ద్వారా పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. భారత దేశంలో వివిధ ప్రాంతాలకు పంపించడానికి గతి ట్రాన్స్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కత్త, చెన్నై తదితర ప్రాంతాలకు విమానం ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు.

పిస్తా హౌజ్

పిస్తా హౌజ్

రంజాన్ మాసాన్ని పురస్కారించుకుని పిస్తా హౌస్ ప్రత్యేకంగా తయారు చేసే హలీం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 కౌంటర్లలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ మాజిద్ ప్రకటించారు.

పిస్తా హౌజ్

పిస్తా హౌజ్

గురువారం పాతబస్తీలోని ఆజం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పిస్తా హౌజ్

పిస్తా హౌజ్

రంజాన్ మాసంలో నాణ్యతతో పాటు, అన్ని పోషక పదార్థాలతో హలీంను మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

పిస్తా హౌజ్

పిస్తా హౌజ్

మాంసాహారంతో పాటు శాకాహార హలీంను కూడా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఐరోపా ప్రజల డిమాండ్ మేరకు వచ్చే ఏడాది నుంచి అక్కడ కూడా హలీం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

పిస్తా హౌజ్

పిస్తా హౌజ్

అదేవిధంగా అమెరికాలోని పలు ప్రధాన నగారాల్లో అక్కడి ప్రజల డిమాండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ ఎన్‌ఆర్‌సీ మీట్ డాక్టర్ వివి కులకర్ణి, సీనియర్ శాస్త్రవేత డాక్టర్ ఎం. ముత్తుకుమార్, ప్రముఖ శాస్త్రవేత డాక్టర్ జి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Pista House proprietor M A Majeed on Thursday said that monosodium glutamate, popularly recognised by the acronym MSG, was not an ingredient in the brand's haleem even as he requested restaurateurs no refrain from using it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X