వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదు : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వాళ్లు అన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక అన్‌లైన్‌లో అనుమతి కోరేవారికి నిబంధల ప్రకారం పత్రాలు ఉంటే 21 రోజుల్లో అనుమతులు మంజురూ చేస్తామని చెప్పారు. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు సంతానం కంటే ఎక్కువా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని ఆయన తెలిపారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటిఆర్ శాసనమండలిలో మున్సిపల్ చట్టంపై చర్చ జరిగింది. దీంతో రానున్న నూతన చట్టంపై పలు విషయాలు వెల్లడించారు. రానున్న మున్సిపల్ చట్టం చాల కఠినంగా ఉంటుందని ఈ సంధర్భంగా చెప్పారు. చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసిన కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లపై ప్రతి మూడు నెలల కోసారి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కమిటీ పర్యవేక్షిస్తోందని అయన చెప్పారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటిల్లో ఎల్ఆర్ఎస్ పద్దతిని కూడ అమలు చేస్తామని తెలిపారు.

No need permission to house construction which is constructed within 75 yards

ఇక చర్చలో భాగంగా పురపాలక సంస్థలపై కలెక్టర్ల అధికారం ఏమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ పవర్ లేదని ఆయన జీవన్ రెడ్డి తెలిపారు. కాగా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడ జీవన్ రెడ్డి అభిప్రాయంతో ఏకిభవించారు. కాగా కొత్త మున్సిపల్ చట్టంలో మొత్తం అయిదు సవరణలు చేసినట్టు మంత్రి తెలిపారు.

English summary
No need permission to house construction which is constructed within 75 yards in cities said telanagan minister KTR speaking in assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X