వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాట

|
Google Oneindia TeluguNews

ఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవనం లో పార్టీ సమావేశాలు నిర్వహించడంపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమి నేతలు ఎన్నికల ముఖ్య అధికారికి ఫిర్యాదు చేశారు.దీనిపై ఎన్నికల ముఖ్య అధికారి టిఆర్ఎస్ కు నోటీసు జారీ చేశారు. మంత్రుల నివాస ప్రాంగణం, అధికారిక భవనాల్లో పార్టీ ఎన్నికల భేటీలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసు లో కోరారు. ఇక తాజాగా కోడ్ ఉల్లంఘన ఏమి జరగలేదని చెప్తున్నారు రజత్ కుమార్.ప్రగతి భవన్ లో సమావేశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ఛీప్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. ఇరవైనాలుగు గంటలలో వివరణ ఇవ్వాలని కోరారు.

టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?

అయితే అలాంటి సమావేశాలేవీ జరగలేదని వివరణ ఇచ్చారు. దీంతో ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఎన్నికల కోడ్‌ ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లో ఎలాంటి పార్టీ కి సంబంధించిన సమావేశాలేమి కూడా జరగలేదని చెప్పారు. తన నివాసాన్ని కెసిఆర్ ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కెసిఆర్ కోడ్ ఉల్లంఘించారు అని చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

No party meetings are taking place during the code in Pragati Bhavan, CEO Rajath Kumar said

తెలంగాణాలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటినుండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో, ఆమె కుమారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా, స్థానిక రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి దర్యాప్తు చేశారని, అసలు అలాంటి సమావేశాలు ప్రగతి భవన్ లో ఎలాంటి సమావేశాలు జరగలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే సమాచారాన్ని రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అందించారు.

English summary
Telangana state chief election officer Rajath kumar said that Telangana Chief Minister's residence Pragati Bhavan wasn't used for any party-related meetings during the election code Chief Election Officer, said the KCR was never misused his residence. It also made clear that there was no truth in the complaints that KCR was violated election code. This information was also send to the Central Election Commission.Telangana state chief election officer Rajath kumar said that Telangana Chief Minister's residence Pragati Bhavan wasn't used for any party-related meetings during the election code Chief Election Officer, said the KCR was never misused his residence. It also made clear that there was no truth in the complaints that KCR was violated election code. This information was also send to the Central Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X