వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీ బస్సులు వెలవెల.. ఇద్దరు ప్రయాణికులతో భాగ్యనగరానికి, సూపర్ లగ్జరీ కూడా.. ఎందుకంటే...

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఏసీ బస్సుల్లో టికెట్ హాట్ కేకే.. టికెట్ అంతా వీజీగా దొరకదు. ఇక సమ్మర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండ, అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట కరోనా వైరస్ నిలవదు. అంతేకాదు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తీసుకోవద్దు. ఇక ఏసీలకు దూరంగా ఉండాలి. కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో ఒకరిద్దరూ ప్రయాణికులు ఉన్న సరే రాజధాని బస్సులు తిరుగుతున్నాయి.

నష్టాలకు తోడు..

నష్టాలకు తోడు..

అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. లాభాలబాటలో కాకున్నా.. జీతాలు, ఖర్చులు వెళితే చాలని యాజమాన్యం అనుకొంటొంది. దీనికి కరోనా వైరస్ తోడయ్యింది. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు పాజిటివ్ రావడంతో.. భాగ్యనగరానికి రావాలంటేనే జనం ఆందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్పు.. వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నిజామాబాద్ బస్టాండ్‌లో ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు రాజధాని బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేంటి గురువారం ఏమైనా బంద్ ఉందా అనే ప్రశ్న తలెత్తింది.

ఇదీ కారణం..

ఇదీ కారణం..

హైదరాబాద్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదవడంతో సిటీకి వచ్చేందుకు ప్రయాణికులు ఇష్టపడటం లేదు. అత్యవసరమైతే తప్ప.. ఇంట్లో నుంచి కాలు బయటకి తీయడం లేదు. దీంతో నిజామాబాద్ బస్టాండ్ వద్ద నాలుగు రాజధాని ఏసీ బస్సులు ఖాళీగా కనిపించాయి. ఒక బస్సులో ఇద్దరు టికెట్ తీసుకోవడంతో.. వారి కోసమే రాజధాని బస్సు బయల్దేరింది. రాజధాని ఏసీ బస్సులే కాదు.. సూపర్ లగ్జరీ బస్సు కూడా ఖాళీగా కనిపిస్తోంది.

Recommended Video

సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల ! | Oneindia Telugu
ఇక్కడ నమోదు కాలే..

ఇక్కడ నమోదు కాలే..

మరోవైపు తెలంగాణ గడ్డ మీద ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఊరికే వదంతులు వ్యాపింపజేయొద్దని సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. మైండ్ స్పేస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అపోలో శానిటేషన్ మహిళ రిపోర్ట్ పుణె నుంచి వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. వీరే కాక 21 మందికి కూడా నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.

English summary
no passengers in ac busses, due to corona virus positive case in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X