• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరైన సమయంలో సరైన ఎంట్రీ: పీసీసీ పీఠంపై రేవంత్ విముఖత.. కారణం అదే

|

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. కేరళ వాయనాడ్ ఘాట్ రోడ్ లోని మలుపులను తలపిస్తున్నాయి టీపీసిసి రాజకీయాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరి కొంత మందిని తొలగించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అదిష్టానం జవసత్తువలు నింపుతుందని గత డిసెంబర్ లో జరిగిన ముందుస్తు ఎన్నికల తర్వాత నుండి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేసాయి. రేవంత్ రెడ్డికి పీసిసి ఇచ్చేసినట్టే కధనాలు ప్రచురించాయి మీడియా సంస్థలు. కాని తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకూ ఎలాంటీ మార్పులు జరగలేదు. పీసిసి విషయంలో గాని, నాయకుల అంశంలో గాని కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అజిత్ ఎఫెక్ట్: శరద్ పవార్ ను నమ్మని కాంగ్రెస్: ఇక ఎన్సీపీతో తెగదెంపులేనా..!అజిత్ ఎఫెక్ట్: శరద్ పవార్ ను నమ్మని కాంగ్రెస్: ఇక ఎన్సీపీతో తెగదెంపులేనా..!

 తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన.. పీసిసి మార్పు దిశగా అదిష్టానం..

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన.. పీసిసి మార్పు దిశగా అదిష్టానం..

ఐతే పిసిసి రేసులో ముందున్న రేవంత్ రెడ్డి చుట్టే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం తిరుగుతోంది. ఆ తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేరును కాంగ్రెస్ అదిష్టానం పీసిసి రేసులో పరిగణలోకి తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ లోని సీనియర్ నాయకుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేసులో ముందున్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం తనకు పీసిసి వదవి అంత అవసరం లేదని అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతిపాదన వెనక పకడ్బంధీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తానంటే ప్రస్తుతం వద్దు, సీనియర్లకు అవకాశం ఇవ్వండి అంటున్న రేవంత్ రెడ్డి మనోగతం వెనక ఓ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.

 రేసులో ముందున్న రేవంత్ రెడ్డి.. పోటీ పడుతున్న సీనియర్లు..

రేసులో ముందున్న రేవంత్ రెడ్డి.. పోటీ పడుతున్న సీనియర్లు..

అసలైన రాజకీయ సంక్షోభాన్ని చాకచక్యంగా పరిష్కరించిన వాడే నిజమైన రాజకీయ చాణఖ్యుడు. సరైనోడు రంగప్రవేశం చేసేంత వరకు చాలామంది రాజకీయాల్లో చాణఖ్యులుగా చలామణి అవుతుంటారు. కాని ఒక్కడు అసలైనోడు వచ్చిన తర్వాత మాత్రం అందరి నోళ్లు మూతబడిపోతాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయిల్లో సరిగ్గా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు చేసి పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తెలంగాణలో సరైన నేతకోసం గత కొద్ది రోజులుగా అణ్వేషిస్తున్నట్టు కూడా తెలిసిందే. రేవంత్ రెడ్డి కి పీసిసి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 నేతల మద్య ఎన్నో విభేదాలు.. పరిష్కరించి ఏకాభిప్రాయం తెచ్చేదెవరు..?

నేతల మద్య ఎన్నో విభేదాలు.. పరిష్కరించి ఏకాభిప్రాయం తెచ్చేదెవరు..?

తెలంగాణ పిసీసీ పదవి తీసుకున్న నాయకుడు ముందుగా పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేధాలను చాకచక్యంగా పరిష్కరించి వారిలో ఏకాభిప్రాయం తీసుకురావాలనేది ప్రధమంగా చేయాల్సిన టాస్క్. ఆతర్వాతే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి రాబోవు ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాద్యత కూడా ఆ నేతపై ఉంది. రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ మూడో సారి కూడా అధికారానికి దూరమైతే పార్టీ ఉనికికే ప్రమాదమని అధిష్టానం భావిస్తోంది. అందుకోసం వచ్చే ఎన్నికల్లో ఎలా ఐనా అధికారంలోకి రావాలని, అందుకోసం పీసిసిలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా పీసిసి అద్యక్షుడిని మార్చాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పదేళ్లుగా అధికారానికి దూరం.. ఈ సారి ఎలాగైనా గెలవాలంటున్న కాంగ్రెస్..

పదేళ్లుగా అధికారానికి దూరం.. ఈ సారి ఎలాగైనా గెలవాలంటున్న కాంగ్రెస్..

తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసిసి పగ్గాలు అప్పగించాలని అధిష్టానం రంగం సిద్దం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఐతే తెలంగాణలో సాదారణ ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉన్నందున మొదటి రెండు సంవత్సరాలు పీసిసి పదవిని వేరే వారికి అప్పగించాలని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందనగా పీసిసి తనకు అప్పగిస్తే ఫలితం ఏంటో చూపిస్తానని రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్బంగా పీసిసి అప్పగిస్తే పార్టీని విజయతీరాలకు చేరుస్తాననే భరోసాను రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.

  Revanth Reddy Will Appoint As TPCC Chief ? || టీ -పీసీసీ నూతన చీఫ్ గా రేవంత్ రెడ్డి..!
   ఇప్పుడే వద్దు.. ఎన్నికల ముందు పీసిసి ఇవ్వండంటున్న రేవంత్ రెడ్డి..

  ఇప్పుడే వద్దు.. ఎన్నికల ముందు పీసిసి ఇవ్వండంటున్న రేవంత్ రెడ్డి..

  రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు కూడా దాదాపు నలభై నియోజక వర్గాల మీద మంచి పట్టున్నట్టు పేర్కొన్నారు. కాగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత అదే పట్టును రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టు సమాచారం. 40 నియోజక వర్గాల్లో అనుకూల వాతావరణం ఉడడంతో, మరో 40నియోజక వర్గాల్లో కష్టపడి ఫలితం రాబట్టాలనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. వచ్చే ఎ్ననికల నాటికి రేవంత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదనే చర్చ జరుగుతోంది. మరి అదిష్టానం ఆలోచన ఎలా ఉందో చూడాలి..!!

  English summary
  Revanth Reddy seems to have indicated to the high command that he will show the result if the PCC is handed over to him for two years to the general Election. Revanth Reddy expresses his assurance that if the PCC is handed over to the election, the party will be successful.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X