వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: శిరీషపై అత్యాచారమే జరగలేదు, ఆమెది ఆత్మహత్యే

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో విచారణ ముగిసిందని పోలీసులు ప్రకటించారు. శిరీష ఆత్మహత్య చేసుకొందని ప్రకటించారు. ఆమెపై అత్యాచారం జరగలేదని కూడ తేల్చి చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో విచారణ ముగిసిందని పోలీసులు ప్రకటించారు. శిరీష ఆత్మహత్య చేసుకొందని ప్రకటించారు. ఆమెపై అత్యాచారం జరగలేదని కూడ తేల్చి చెప్పారు. అయితే ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదికను రెండు రోజుల్లో అధికారికంగా బయటపెట్టనున్నారు పోలీసులు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుంబసభ్యులు. ఆమె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని చెబుతున్నారు. ఆమెను హత్యచేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్యే చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవంటున్నారు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది.ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు చెబతున్న వాదనతో పోలీసులు ఏకీభవించం లేదు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారం చేయలేదని నిర్ధారించారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదికను త్వరలోనే బయటపెట్టనున్నారు.

బ్యూటీషీయన్ శిరీష కేసు విచారణ పూర్తి

బ్యూటీషీయన్ శిరీష కేసు విచారణ పూర్తి

అనేక వివాదాలు, రోజుకో మలుపు...అనుమానాలు, ట్విస్ట్ ల మీద ట్విస్ట్‌లతో ఈ కేసు ప్రతిరోజూ మీడియాలో ప్రముఖంగా నిలిచిపోయింది. ఈ విషయమై శిరీష కుటుంబసభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ పూర్తైందని శుక్రవారం నాడు వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. శిరీష ఆత్మహత్య చేసుకొందని ప్రకటించారు.ఆమెను ఎవరూ హత్య చేయలేదన్నారు.

ఆత్మహత్యే శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలున్నాయి

ఆత్మహత్యే శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలున్నాయి

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్యే చేసుకొందని చెప్పేందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని డిసిపీ వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదన్నారు. అయితే కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ లో శిరీష భయపడి గొడవ చేయడం వల్లే రాజీవ్ ఆమెపై దాడి చేశాడని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. అయితే ఆమెను హత్య చేయలేదన్నారు. మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకొందని పోలీసులు ప్రకటించారు.

మద్యం సేవించి ఉంది

మద్యం సేవించి ఉంది

బ్యూటీషీయన్ శిరీష మద్యం సేవించి ఉందని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు.ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదిక పోలీసుల చేతికి అందింది.ఈ నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెపై అత్యాచారం జరగలేదని చెబుతున్నారు. ఇంతకుముందే ప్రాథమికి నివేదిక కూడ ఇదే విషయాన్ని ప్రకటించింది. శుక్రవారం నాడు ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది.ఈ నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని స్పష్టమైందని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని పోలీసులు ధృవీకరించారు. బ్యూటీషీయన్ శిరీష మద్యం సేవించి ఉందని ఈ నివేదిక కూడ చెబుతోందన్నారు.

నిందితులకు బెయిల్ నిరాకరణ

నిందితులకు బెయిల్ నిరాకరణ

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్ లు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు వారికి బెయిల్ నిరాకరించింది. శిరీష కుటుంబసభ్యుల అనుమానాలపై దర్యాప్తు దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 11వ, తేదికి వాయిదావేసింది.మరో వైపు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా ప్రయత్నిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో నిందితులకు శిక్షలు పడేలా శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు.

English summary
Beautician Sirisha suicide case investigation completed said West zone DCP Venkateshwar rao on Friday. Si Prabhakar reddy tried to rape attempt on her said police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X