
రేవంత్ రెడ్డి పీసీసీ అని నేను కాంగ్రెస్‌లో చేరట్లేదు -సీపీకి ఫర్యాదు -చివరి దాకా కేసీఆర్‌తోనే: దానం నాగేందర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం ఎఫెక్ట్ సొంత పార్టీలోనేకాదు, అధికార టీఆర్ఎస్ లోనూ కనిపిస్తోంది. రకరకాల పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడి, వివిధ పార్టీల్లో చేరిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలన్న రేవంత్ పిలుపుపై చర్చ జరుగుతోందని, ఖట్టర్ కాంగ్రెస్ వాదులంతా ఘర్ వాపసీ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ గూటికి తిరిగెళ్లబోయే నేతల జాబితాలో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. వైఎస్సార్ హయాంలో సిటీ కాంగ్రెస్ ను లీడ్ చేసిన దానం.. టీఆర్ఎస్ లో చేరి, ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా,

కాంగ్రెస్‌లోకి దానం రీజాయిన్?
రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత వరుసగా సీనియర్లతో భేటీ అవుతోన్న రేవంత్ రెడ్డి.. పార్టీ వీడిన మిగతా నేతలనూ కలుస్తానని ప్రకటన చేయడం తెలిసిందే. ఆక్రమంలో రేవంత్ త్వరలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కలవబోతున్నారని, కాంగ్రెస్ లో రీజాయినింగ్ కు దానం సైతం సుముఖంగా ఉన్నారని కొన్ని న్యూస్ వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. అవి సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో దానం వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన దానం.. తాను కాంగ్రస్ లో చేరబోతున్నాననే వార్తలను ఖండించారు. చివరి శ్వాసదాకా కేసీఆర్, కేటీఆర్ లతోనే ఉంటూ, టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు.

రేవంత్‌కు మూతి, తోక తెలుసా?
''కొత్త
బిచ్చగాడు
పొద్దెరగడు
అన్నట్లుగా
పీసీసీ
చీఫ్
రేవంత్
రెడ్డి
తీరు
ఉంది.
ఆయన
మాటలకు
మూతి,
తోక
ఉండదు.
అధికారాన్ని
గుంజుకునుడే
అంటున్నాడాయన.
ఇక్కడ
గుంజుకోవడానికి
ఎవడబ్బ
సొమ్ము?
గతంలో
వైఎస్సార్
చివరి
శ్వాస
వరకు
ఆయనతోనే
ఉన్నాను.
ఇప్పుడు
కూడా
చివరి
శ్వాస
వరకు
కేసీఆర్,
కేటీఆర్‌తోనే
ఉంటాను.
నా
ప్రాణం
ఉన్నంత
వరకు
టీఆర్ఎస్లోనే
ఉంటా.
కాంగ్రెస్‌లోకి
వెళ్లడానికి
ఆ
పార్టీలో
ఏముంది?
కేసీఆర్
నాకు
మంత్రి
పదవి
ఇవ్వలేదనే
కోపంతో
కాంగ్రెస్
లో
చేరబోతున్నట్లు
ఓ
వర్గం
కావాలనే
తప్పుడు
ప్రచారం
చేస్తుంది.
ఒక
వేళ
నా
ఇంటికి
ఎవరైనా
రావాలంటే
గులాబీ
కండువ
మెడలో
ఉంటేనే
ఎంట్రీ
ఉంటుంది.
డబ్బులు
పెట్టి
పదవులు
కొనే
సంస్కృతి
ఉన్న
కాంగ్రెస్
నుంచి
సీనియర్లంతా
టీఆర్ఎస్ల
లోకి
రావాలని
నేనే
పిలుపునిస్తున్నా''
అని
దానం
చెప్పారు.
కాగా,

ఆ వెబ్సైట్లపై దానం ఫిర్యాదు
తెలంగాణ
రాకముందు
హైదరాబాద్
ప్రజలకు
కనీసం
తాగునీరు
లేదని,
స్వరాష్ట్రంలో
సీఎం
కేసీఆర్,
మంత్రి
కేటీఆర్
కృషితో
సమస్యలు
తీరాయని,
రాష్ట్రంలో
జరుగుతోన్న
అభివృద్ధిని
చూడకుండా
పీసీసీ
చీఫ్
రేవంత్
రెడ్డి,
బీజేపీ
చీఫ్
బండి
సంజయ్
ఇష్టమొచ్చినట్లు
మాట్లాడుతున్నారని
దానం
నాగేందర్
ఆగ్రహించారు.
వైఎస్సార్
రాజ్యం
కంటే
డబుల్
అభివృద్ధిని
కేసీఆర్
చేసి
చూపించారని
అన్నారు.
తాను
కాంగ్రెస్
పార్టీలో
చేరుతున్నట్లు
తప్పుడు
కథనాలను
ప్రచురించిన
దిశ
అనే
వెబ్సైట్,
ఆర్బీసీ
అనే
యూట్యూబ్
ఛానెల్‌పై
హైదరాబాద్
సీపీ
అంజనీ
కుమార్
కు
టీఆర్ఎస్
ఎమ్మెల్యే
దానం
నాగేందర్
ఫిర్యాదు
చేశారు.
తప్పుడు
కథనాలు
ప్రసారం
చేసిన
ఈ
రెండింటిపై
చట్టపరమైన
చర్యలు
తీసుకోవాలని
ఆయన
కోరారు.