వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలగింపులు లేని మంత్రివర్గ విస్తరణ.....! సీఎం కేసిఆర్‌ను కలిసిన ఈటల

|
Google Oneindia TeluguNews

మరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఉన్నవారిని కదిలించకుండా శాఖలను మాత్రమే మార్పులు చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్న మంత్రుల తొలగింపు ప్రచారానికి తెరపడినట్టే....ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆదివారం సాయంత్రం ఏడుగంటలకు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది.

18కి చేరుకున్న తెలంగాణ మంత్రులు

18కి చేరుకున్న తెలంగాణ మంత్రులు

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌లోకి మొత్తం 18 మందిని తీసుకునే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రితో పాటు 12 మంది మాత్రమే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.అయితే మంత్రుల శాఖల కేటాయింపు తర్వాత పలువరు మంత్రుల్లో ఆసంతృప్తి నెలకోంది. దీంతో రాష్ట్ర పరిపాలన వ్యవస్థ కూడ గాడి తప్పింది. ఈనేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇటివల కాలంలో పుంజుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగిస్తారనే ప్రచారం జరిగింది.

ఈటల, మల్లారెడ్డిల తొలగింపుపై తొలగిన ఉత్కంఠ

ఈటల, మల్లారెడ్డిల తొలగింపుపై తొలగిన ఉత్కంఠ

ముఖ్యంగా వైద్యశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. ఆయన ప్రభుత్వ వ్వవహారాలను బహిరంగ పరుస్తున్నారనే ఆలోచనతో సీఎం కేసిఆర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈనేపథ్యలంనే ఇటివల ఈటల రాజెందర్ గులాబి జెండాకు తాము కూడ ఓనర్లమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీల్లో ఆయనకు పలువురు మద్దతు కూడ తెలిపారు. ఇలాంటీ పరిణామాల నేపథ్యలంలోనే ఆయనను మంత్రి వర్గం నుండి తొలగిస్తారనే ప్రచారం కూడ జరిగింది. ఇక ఈటలతోపాటు కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్లు కూడ వినిపించాయి.

నేడు సీఎంను కలిసిన మంత్రి ఈటల

నేడు సీఎంను కలిసిన మంత్రి ఈటల

అయితే మంత్రుల తొలగింపుకు చెక్‌ పడినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం మంత్రి ఈటల రాజెందర్ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్‌కు చెక్‌పడింది. ఈటల సీఎం కలిసిన అనంతరం మంత్రుల శాఖలకు సంబంధించి చర్చకూడ జరిగినట్టు తెలుస్తోంది. అయితే కరీంనగర్ స్థానం నుండి ఇప్పటికే ఈటల రాజెందర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌లు ఉండగా ప్రస్తుత కేబినెట్ విస్తరణలో మరో ఇద్దరికి స్థానం కల్పించిన సీఎం కేసిఆర్ కేటిఆర్‌తో పాటు గంగుల కమాలాకర్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
In the wake of the Cabinet expansion, six new ministers will take oath into the state cabinet, without removing any ministers ,with only change the portfolios.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X