అవమానాలకు గురయ్యా, ఆత్మగౌరవం లేదు,శశికళకు పట్టిన గతే: నాగం సంచలనం
హైదరాబాద్: బిజెపిలో అనేక అవమానాలకు గురయ్యాయయని, ఆత్మగౌరవం లేదని మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.ఈ కారణాలతోనే తాను బిజెపిని వీడాలని నిర్ణయం తీసుకొన్నానని నాగం జనార్థన్ రెడ్డి చెప్పారు ఉగాది తర్వాత తన కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్థన్ రెడ్డి చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని సమాచారం.
బిజెపికి షాక్: ఉగాది తర్వాత కీలక ప్రకటన, పార్టీ వీడే యోచనలో నాగం
తాను త్వరలో చేరే పార్టీ అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ ప్రస్తుతం చేసిన అవినీతి కార్యక్రమాలను ఎండగట్టనున్నట్టు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు.ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చోటు చేసుకొన్న విషయాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అజహరుద్దీన్ మనోడేనా, రాజకీయ కుట్ర, పాకిస్థాన్ కోడై కూస్తోంది: విహెచ్ సంచలనం
2019 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని నాగం జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన సేవలను పార్టీ ఉపయోగించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని, బిజెపి నేతలు ఎండగట్టలేకపోయారని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.

బిజెపిలో అవమానాలకు గురయ్యా
బిజెపి నేతలు తన సేవలను సక్రమంగా వినియోగించుకోలేకపోయారని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. నాగర్ కర్నూల్ ప్రజలు, తన ఆత్మగౌరవం లేకుండా పోయిందని నాగం జనార్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కారణాల రీత్యానే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నానని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమయ్యే పరిస్థితి లేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు,. అంతేకాదు తనను నమ్ముకొన్న క్యాడర్ కు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో బిజెపిని వీడాలని నిర్ణయం తీసుకొన్నానని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.

నా శక్తి ఏమిటో చూపిస్తా
నా శక్తి ఏమిటో చూపిస్తానని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. పండుగ తర్వాత తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.తాను త్వరలో చేరే పార్టీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకొన్న అవినీతిని బట్టబయలు చేయనున్నట్టు చెప్పారు.ఒకవేళ ప్రభుత్వంలోకి రాకపోతే అసెంబ్లీలో టిఆర్ఎస్ తీరును ఎండగట్టనున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.

కెసిఆర్ గురించి మాట్లాడనివ్వడం లేదు
రాష్ట్ర బిజెపి నేతలు కెసిఆర్ కుటుంబం, ప్రభుత్వ అవినీతిపై తనను మాట్లాడనివ్వడం లేదని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని రాష్ట్ర నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని, తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ కష్టమేనని నాగం జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కు మిత్ర పక్షంలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

శశికళకు పట్టిన గతే
కెసిఆర్ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడుతోందని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ విషయమై అనేక ఆధారాలతో తాను కోర్టులను ఆశ్రయించినట్టు చెప్పారు. కానీ, పార్టీ తరుపున తనకు ఎలాంటి మద్దతివ్వలేదన్నారు తమిళనాడులో శశికళకు పట్టిన గతే కెసిఆర్ కుటుంబానికి పడుతోందని నాగం చెప్పారు.ఎవరు కూడ కెసిఆర్ కుటుంబాన్ని రక్షించలేరని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.