వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1 నుండి 5వ తరగతి వరకు నో స్కూల్స్ .. కరోనా సెకండ్ వేవ్ , కొత్త స్ట్రెయిన్ ల దెబ్బకు తెలంగాణా సర్కార్ అలెర్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ , అలాగే కరోనా కొత్త రకం వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం .ఇదే సమయంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యేలా చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ట్రేసింగ్ , టెస్టింగ్, ట్రీటింగ్ విధానం అనుసరిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు.

 జడలు విప్పుతున్న కరోనా రక్కసి ఇంకో కొత్త వేషం .. బ్రిటన్ లో ఇద్దరికి దక్షిణాఫ్రికా మరోకొత్త రకం స్ట్రెయిన్ జడలు విప్పుతున్న కరోనా రక్కసి ఇంకో కొత్త వేషం .. బ్రిటన్ లో ఇద్దరికి దక్షిణాఫ్రికా మరోకొత్త రకం స్ట్రెయిన్

ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ తెరవొద్దని ప్రభుత్వ నిర్ణయం

ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ తెరవొద్దని ప్రభుత్వ నిర్ణయం


ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు స్కూల్స్ ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆయా తరగతులకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఈ నిర్ణయంతో కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం మేరకు స్కూల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా వర్తించనున్నట్లుగా తెలుస్తుంది.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో తెలంగాణా అలెర్ట్ .. యూకే నుండి వచ్చిన వారికి పరీక్షలు

కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో తెలంగాణా అలెర్ట్ .. యూకే నుండి వచ్చిన వారికి పరీక్షలు

ఇదే సమయంలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇటీవల నెలరోజులుగా యూకే నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు పన్నెండు వందల మంది యూకే నుండి తెలంగాణకు వచ్చినట్లు గుర్తించామని వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు .

 ఆందోళన వద్దన్న హెల్త్ డైరెక్టర్ .. జాగ్రత్తలు పాటించాలని సూచన

ఆందోళన వద్దన్న హెల్త్ డైరెక్టర్ .. జాగ్రత్తలు పాటించాలని సూచన


యూకే నుండి వచ్చిన వారికి ఇప్పటివరకు జరిగిన పరీక్షలలో ఎవరికి కొత్త కరోనా వైరస్ జాతి నిర్ధారణ కాలేదు అన్నారు. కొత్త రకం కరోనా వైరస్ తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని , సామాజిక దూరం పాటించాలని, ప్రజలు సహకారం అందిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ , అలాగే కొత్త కరోనా స్ట్రెయిన్ కారణంగా నెలకొన్న ఆందోళన నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం విద్యార్థుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుంది.

English summary
The Telangana government wants the people to be vigilant about the second wave in the state of Telangana, as well as the new type of corona virus. The government has taken a preliminary decision not to open schools from class one to class five. With this decision it looks like students from class one to class five will be able to be promoted directly to the respective classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X