హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ చైనా పర్యనటపై ఎంపీ పాల్వాయ గోవర్ధన్ రెడ్డి సెటైర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్ చైనా పర్యనట వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు.

ప్రపంచంలోని ఏ దేశంలోను చైనా తన కార్యక్రమాలను చేపట్టలేదని... అలాంటిది, తెలంగాణలో చేపట్టే అవకాశమే లేదని చెప్పారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని, రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నప్పటికీ కేంద్రం సాయం కోసం ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు.

No use of kcr china trip says palvai govardhan reddy

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ప్రభుత్వం చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందన్నారు. తెలంగాణకు పూర్తిస్థాయి ఇంఛార్జ్ కావాలన్నారు.

అలాగే సీఎల్పీ నేత జానారెడ్డి కంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చక్కగా పనిచేస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా పోరాటం చేస్తున్నారన్నారు.

రాబోయే రోజుల్లో పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దూకుడుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

English summary
No use of kcr china trip says palvai govardhan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X