వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పద్మ’ పురస్కారానికి తెలంగాణలో అర్హులే లేరా? కేటీఆర్, కవిత స్పందించరేం?: పొన్నం ప్రభాకర్

‘పద్మ’ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘పద్మ’ పురస్కారానికి తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన 'పద్మ' పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'పద్మ' పురస్కారాన్ని అందుకునేందుకు తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు 'పద్మ' పురస్కారాలు దక్కకపోవడానికి కారణాలేంటో టీఆర్ఎస్ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ponnam-prabhakar

పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, అంతే కాకుండా పార్లమెంట్‌లో బీజేపీ లేవనెత్తిన ప్రతి అంశానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని పొన్నం తెలిపారు.

అయినా 'పద్మ' పురస్కారాల్లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిందని, ప్రతి అంశానికి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించే కేటీఆర్, కవితలు.. ఈ విషయమై స్పందించరేమని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

English summary
Nobody is eligible for Padma Awards from Telangana? questioned Former MP, Telangana Congress leader Ponnam Prabhakar on Friday. While speaking to media he demanded Telangana Government to reveal the reasons behind this injustice. Ponnam said that telangana government is cooperating in every aspect with Central Government. On demonetisation, Presidential Election and many more issues also CM KCR cooperating with central government he told. Then why Centre done this much injustice to Telangana State regarding Padma Awards, he questioned. KTR and Kavita responds on everthing through their twitter accounts, But on Padma Awards they are not responding, Why? Ponnam questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X