హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఏందీ ఈ మోతలు..! నగరంలో ఎక్కువుతున్న శబ్ధ కాలుష్యం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశ్వ నగరం అన్నిరకాల సమస్యలతో నలిగిపోతోంది. నగరంలో శబ్ధ కాలుష్యం పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లోని 70 కేంద్రాల్లో నమోదైన కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సీపీసీబీ నివేదికను విడుదల చేసింది. కాలుష్య తీవ్రతలను బట్టి హైదరాబాద్‌లో శబ్ధ కాలుష్యం ఎక్కువగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది.

నగరంలో గల 10 శబ్ధకాలుష్య నమోదు కేంద్రాల్లో పరిమితికి మంచి కాలుష్యం నమోదవుతున్నది. ఒక్క జూపార్క్ మినహా మిగతా 9 స్టేషన్లల్లో కాలుష్యం భారీగా నమోదవుతున్నది. వాహనాల నుంచి వెలువడుతున్న రణగొణ ధ్వనుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొంటుందని పీసీబీ సైంటిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మన చెవి 25 నుంచి 40 డెసిబిల్స్ వరకు సాధారణ శబ్ధాన్ని మాత్రమే వినగలదు.

Noise pollution in the city..!!

Recommended Video

అల్వాల్ లో రోడ్డు విస్తరణ పనులు, కళ్ళు కంపౌండ్ ప్రహరీ కూల్చివేత

కొన్ని సందర్బాలో మాత్రమే 60 నుంచి 80 డెసిబుల్స్ అయినా తట్టుకుంటుంది. ఆపై ఎక్కువ శబ్ధాన్ని వింటే మానసిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. శబ్ధతీవ్రతల కారణంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. శబ్ధం మన నాడీ వ్యవస్థ మీద, మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఒక్కోసారి శాశ్వత వినికిడి లోపానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. కేవలం తాత్కాలిక ప్రభావమే కాకుండా, శారీరక, మానసిక వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

నిత్యం ఇతరులతో వ్యవహరించే ప్రవర్తనపై కుడా శబ్ధాలు ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో 79 సంవత్సరాలు కలిగిన వారిలో చాలా మంది వినికిడిలోపంతో బాధపడుతున్నారని తేలింది. కారణాలు అన్వేషిస్తే ధ్వని కాలుష్యం కారణంగానే వారు వైకల్యం పొందినట్లు స్పష్టమైంది. చెవి నుంచి శబ్ధ తరంగాలు నేరుగా నాడీ వ్యవస్థ నుంచి మెదడుకు చేరుతాయి. ఇలా నిద్రలేమికి, ఆరోగ్య సమస్యలకు శబ్ధ కాలుష్యం కారణమవుతున్నదని వైద్యులు పేర్కొంటున్నారు.

English summary
Noise pollution is increasing in the city. The CPCB has released its report, which considers the pollution recorded in 70 centers in 7 major cities across the country. The Central Pollution Control Board has found that the high pollution in Hyderabad is high due to pollution intensities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X