వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు ఉపపోరుకు నేటినుండే నామినేషన్లు: అమలవుతున్న ఎలక్షన్ కోడ్; ఊపందుకున్న రాజకీయం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న మునుగోడు పోరుకు ఉప ఎన్నిక ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నేటి నుండి నామినేషన్లను స్వీకరించడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నల్గొండ జిల్లాలోని చండూర్ తహసిల్దార్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి జగన్నాధరావు నోటిఫికేషన్ విడుదల చేసి, నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు... నామినేషన్ లకు వచ్చేవారి కోసం ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు.

మునుగోడులో ఉప ఎన్నికల ప్రక్రియ షురూ

మునుగోడులో ఉప ఎన్నికల ప్రక్రియ షురూ


నియోజకవర్గంలోనిఏడు మండలాలకు ఎమ్‌సీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ టీం) 6 బృందాలు , ఎస్‌ ఎస్ టి(సర్వే స్టాస్టిక్స్‌టీం) 6 బృందాలు , ఎఫ్ ఎస్ టి (ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీం) 7 బృందాలు , వి ఎస్ టి (వీడియో సర్వేలెన్స్‌ టీం) 6 బృందాల చొప్పున ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు చెందిన వాల్‌ పెయింటింగ్‌లు, పోస్టర్లు, స్థంబాలకు కట్టిన ప్లెక్సీలను మునిసిపల్‌ సిబ్బందితో తొలగించే ప్రక్రియ చేపట్టారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు మునిసిపాలిటీ సిబ్బంది ముసుగువేశారు. నేటి నుంచి ఎన్నికల పోరు ప్రారంభం కానున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

 నేడే నోటిఫికేషన్... నేటి నుండి నామినేషన్లు .. షెడ్యూల్ ఇదే

నేడే నోటిఫికేషన్... నేటి నుండి నామినేషన్లు .. షెడ్యూల్ ఇదే


ఇదిలా ఉంటే నేటి నుండి చండూరు లోని తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:00 వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండవ శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తారు. ఇక అదే రోజు ఎన్నికల విజేతను కూడా ప్రకటిస్తారు.

దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్ కు కీలకంగా ఎన్నిక

దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్ కు కీలకంగా ఎన్నిక

నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రధాన పార్టీల నాయకులంతా మునుగోడు బాటపట్టారు. ఇక టిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మునుగోడులో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో గెలిస్తే, భవిష్యత్తు రాజకీయాలు వేరేలా ఉంటాయి. ఒకవేళ ఎన్నికలలో ఓటమి పాలైతే టిఆర్ఎస్ పార్టీకి దేశంలో పట్టు దక్కకపోగా, రాష్ట్రంలో సైతం పట్టు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి టిఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికలను తమ ఖాతాలో వేసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.

విజయం కోసం పోరాటం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్

విజయం కోసం పోరాటం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్

ఇక బిజెపి నుండి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండటంతో మళ్ళీ తన ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని, కాషాయ జెండా ఎగురవెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో మళ్లీ తన సిట్టింగ్ స్థానం కోసం మునుగోడులో పోరాటం చేస్తోంది. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతోటి మునుగోడు రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

English summary
The process of nominations for Munugodu by-election will start from today itself. In this context, Munugodu election code will be implemented. This gave momentum to politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X