వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పరిశీలన..భువనగిరి పెండింగ్ ! | Oneindia

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 16 స్థానాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది.

పరిశీలన తర్వాత 16 స్థానాల జాబితానే ప్రకటించిన ఈసీ

పరిశీలన తర్వాత 16 స్థానాల జాబితానే ప్రకటించిన ఈసీ

16 లోక్‌సభ స్థానాల్లో 612 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 482 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. అత్యధికంగా నిజామాబాద్ నుండి 191 నామినేషన్లు ఆమోదించి అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అంత మంది సభ్యులు ఎన్నికల బరిలో నిలతంతో బ్యాలెట్ ముద్రణ తప్పని సరి కానుంది.

భువనగిరిలో తిరస్కరణకు గురైన అభ్యర్థుల పునఃపరిశీలన అప్పీల్

భువనగిరిలో తిరస్కరణకు గురైన అభ్యర్థుల పునఃపరిశీలన అప్పీల్

భువనగిరి స్థానంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. అందుకే భువనగిరి నియోజకవర్గం మినహా మిగిలినస్థానాల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆమోదించిన జాబితాను ప్రకటించారు అధికారులు. అయితే భువనగిరి నియోజకవర్గం నుండి స్వతంత్రులుగా బరిలోకి దిగిన సదరు అభ్యర్థులు పునఃపరిశీలన కోసం అప్పీల్‌ చేశారు.

నిజామాబాద్ లో కవితతో 184 మంది రైతుల వార్ .. బ్యాలెట్ ముద్రణ పై ఆధారపడి ఎన్నిక నిజామాబాద్ లో కవితతో 184 మంది రైతుల వార్ .. బ్యాలెట్ ముద్రణ పై ఆధారపడి ఎన్నిక

భువనగిరి పెండింగ్ ఇందుకే .. 28తో ముగియనున్న ఉపసంహరణ గడువు

భువనగిరి పెండింగ్ ఇందుకే .. 28తో ముగియనున్న ఉపసంహరణ గడువు

భువనగిరి నుండి పోటీ కి నామినేషన్ వేసిన వారి అభ్యర్ధన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు ఈ ముగ్గురు అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక దీని తర్వాత అభ్యర్థులు ఎన్నికల బరిలో ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి .

English summary
In Telangana, the number of nominations has come to a total of 795 nominations for the 17 Lok Sabha seats in Telangana. The Chief Electoral Officer of the State Election Commission announced details of the 16 seats after scrutiny of nominations on Tuesday. Of the 612 candidates nominated in 16 Lok Sabha seats, 130 nominations were rejected for various reasons. The Returning Officers approved the nominations of 482 candidates. Due to the appeal of the few candidates Bhuvanagiri is in pending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X