వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 లక్షల కోసం కాదు.. లక్ష కోసమే చేపల వ్యాపారి హత్య, విచారణలో వెలుగులోకి ట్విస్టులు

|
Google Oneindia TeluguNews

చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసులో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అతనిని రూ.90 లక్షల కోసం కాదు రూ.లక్ష కోసమే నిందితులు హత్య చేశారని తెలుస్తోంది. మరిన్ని డబ్బుల కోసమే శ్రీనివాస్ అలియాస్ రాజు, అనురాధ నాటకం ఆడారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే రమేశ్‌ను వారు హతమార్చారని, డబ్బుల కోసమే గేమ్స్ ప్లే చేశారని తెలిపారు.

 డబ్బులు ఉన్నాయని..

డబ్బులు ఉన్నాయని..

రమేశ్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రమేశ్ నివసించే బోరబండ రామారావునగర్‌లో కొన్నేళ్ల కిందట నిందితుడు శ్రీనివాస్ అద్దెకు ఉన్నాడు. ఆ సమయంలోనే రమేశ్‌ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని గ్రహించాడు. ఎలాగైనా కిడ్నాప్ చేయాలని భావించి పథక రచన చేశాడు. ఇందుకు తన రెండో భార్య అనురాధను పావుగా వాడారు. హనీట్రాప్ చేయించి గదిలోకి తీసుకొచ్చాడు.

15 రోజుల ముందే అద్దెకు ఇల్లు

15 రోజుల ముందే అద్దెకు ఇల్లు

కిడ్నాప్ చేయడానికి 15 రోజుల ముందే జవహర్‌నగర్‌లో శ్రీనివాస్ గదిని అద్దెకు తీసుకున్నాడు. అనురాధ తన భార్య అని చెప్పి యాజమానికి చెప్పాడు. తర్వాత మెల్లగా రమేశ్‌-అనురాధ మధ్య మాటలు కలిపాడు. ఆమె హస్కి గొంతుతో రమేశ్‌ను ఆకట్టుకొంది. గది వద్దకు రమ్మని చెప్పడంతో.. వారి కుట్ర తెలియక రమేశ్ జవహర్ నగర్ వచ్చాడు. అప్పటికే అక్కడున్న శ్రీనివాస్.. రమేశ్‌ను పట్టుకొని కాళ్లు, చేతులు కట్టేశారు. తర్వాత అతని వద్ద ఉన్న బంగారం, నగదు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారం ఉంటుందని అనుకొన్నారు. కానీ బంగారం విక్రయిస్తే రూ. లక్ష రావడంతో వారికి ఆశ పెరిగింది.

దాడి చేసి..

దాడి చేసి..

అప్పటికే రమేశ్‌పై దాడి చేసి, హతమార్చారు. అతని ఫోన్ ద్వారా కోడలు వినితకు సమాచారం అందించారు. రమేశ్‌ను కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. రమేశ్‌ను చంపి కూడా వారు అలా నాటకం ఆడారు. కిడ్నాపర్లు చెబుతోంది నిజమే అనుకొని డబ్బులను సిద్ధం చేస్తున్నారు. చివరగా రూ.10 లక్షలు జమయ్యాయని చెప్పారు. అయితే జవహర్ నగర్ ఇంటి వెనకాల నుంచి దుర్వాసన వస్తోందని కొందరు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అతనిని పరిశీలించగా.. ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్‌‌లో నమోదుచేసిన మిస్సింగ్ కేసు రమేశ్ అని తేలింది. దీంతో కేసు చిక్కుముడి వీడింది.

రమణయ్యకు లాస్ట్ కాల్..

రమణయ్యకు లాస్ట్ కాల్..

రమేశ్ మృతదేహం లభించిన నిందితులను పట్టుకోవడం కష్టంగా మారింది. శ్రీనివాస్.. ఇంటి యాజమానికి ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు. దీంతో అతని చివరి కాల్ రమణయ్యకు వెళ్లినట్టు గుర్తించి.. వలపన్ని పట్టుకొన్నారు. శ్రీనివాస్, అనురాధను అరెస్ట్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, డబ్బుల కోసమే హత్య చేశారని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

English summary
not 90 lakh one lakh only.. fish trader ramesh murder mystery reveal police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X