వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంజూరైన ఋణం ఇవ్వలేదని... బ్యాంకు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

|
Google Oneindia TeluguNews

బ్యాంకు అధికారుల తీరుతో విసిగి పోయిన ఓ రైతు బ్యాంకు ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన పేరు మీద మంజూరు చేసిన రుణాన్ని బ్యాంకు అధికారులు పంపిణీ చేయకపోవడంతో ఆ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని చెరువు ముందు తండాకు చెందిన రైతు జె సర్వన్ గొర్రెల కొనుగోలు కోసం ప్రభుత్వం నుంచి రుణం కోసం దరఖాస్తు చేయగా, రూ .1.30 లక్షల రుణం మంజూరు చేశారు. అయితే బ్యాంక్ అధికారులు ఏవో సాకులు చెబుతూ ఆ రుణం తాలూకు నగదును సదరు రైతుకు ఇవ్వకుండా బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారు . మంజూరు చేసిన మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయడానికి సంబంధించి, సర్వన్ గత సంవత్సరంన్నర నుండి నిరంతరం బ్యాంకుకు వస్తూనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటివరకు, బ్యాంకు అధికారులు ఏవో కారణాలు చెప్పి సదరు రైతు డబ్బును విడుదల చేయడం లేదు.

Not a loan granted, A farmer committed suicide in front of the bank

దీంతో విసిగిపోయిన రైతు తీవ్ర నిరాశతో బ్యాంకు వద్దనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే సోమవారం ఐఓబి మహబూబాబాద్ శాఖకు వెళ్లి రుణ మొత్తంపై అధికారులను అడిగారు. బ్యాంకు అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో, సర్వన్ బ్యాంకు ప్రాంగణంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ అధికారులను విచారించడంతో పాటుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A farmer has attempted suicide by consuming pesticides as the bank officials were not disbursing the sanctioned loan. This incident has taken place at Mahabubabad on Monday. According to victim's family members, a farmer J Sarvan, who belong to Cheruvu Mundu Thanda in Kesamudram Mandal here in the district has sanctioned a loan of Rs 1.30 lakh from the government for the purchase of sheep's.but bank officials not tranfered the money to his account . So the farmer committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X