వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయను హతమార్చాలనుకోలేదు, బెదిరిద్దామనుకున్నాడు.. వినకపోవడంతోనే దాడి, సురేశ్ భార్య లత

|
Google Oneindia TeluguNews

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. విజయారెడ్డిని సజీవదహనం చేసిన రైతు సురేశ్ కూడా చనిపోయాడు. 65 శాతం కాలిన గాయాలతో శుక్రవారం మధ్యాహ్నాం మృతిచెందగా.. అతని భార్య సంచలన విషయాలు వెల్లడించారు. తమ భూమి, అప్పులు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై మాట్లాడారు. భూమి రిజిస్ట్రేషన్ చేసి తమకు న్యాయం చేయాలని సురేశ్ భార్య లత కోరుతున్నారు.

పట్టా కోసం తిరిగి.. తిరిగి....

పట్టా కోసం తిరిగి.. తిరిగి....

తమ భూమి పట్టా కోసం తహశీల్దార్ విజయారెడ్డి చుట్టూ తన భర్త సురేశ్ తిరిగాడని గుర్తుచేశారు. కానీ పట్టా చేయలేదని తిప్పుకొన్నారే తప్ప పనిచేయలేదన్నారు. పట్టా కోసం లంచం డిమాండ్ చేశారని.. ఇప్పటికే అప్పల పాలైనందున ఇచ్చుకోలేనని చెప్పాడని తెలిపారు. లంచానికి బదులు ఇళ్లు రాసిస్తానని చెప్పిన వినిపించుకోలేదన్నారు. కాళ్లు పట్టుకున్న కనికరించలేదని గుర్తుచేశారు.

బెదిరిద్దామనుకొని..

బెదిరిద్దామనుకొని..

విధిలేని పరిస్థితుల్లో విజయారెడ్డిని బెదిరిద్దామని తనపై పెట్రోల్ పోసుకున్నాడని చెప్పారు. కానీ అనుకోకుండా విజయారెడ్డికి మంటలు అంటుకొన్నాయని చెప్పారు. విజయారెడ్డిని చంపడానికి సురేశ్ వెళ్లలేదని చెప్పాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి భయపెట్టాలని అనుకొన్నాడు. కానీ విజయారెడ్డి వినకపోవడంతో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయని చెప్పారు. విజయారెడ్డి మృతి తమకు బాధ కలిగిస్తోందన్నారు. తాము కూడా కుటుంబ పెద్దను నష్టపోయామని చెప్పారు.

 పగవాడికి కూడా..

పగవాడికి కూడా..

సురేశ్ లాంటి చావు ఏ రైతుకు కూడా రావొద్దని చెప్పారు. తన భర్త సురేశ్ మృతిచెందాడని.. ఆయన తిరిగి రాలేడని.. కానీ తమ భూముల విషయంలో న్యాయం చేయాలని లత డిమాండ్ చేశారు. గౌరెల్లిలో తమ భూమి పట్టా కోసం సురేశ్ ఇప్పటికే రూ.10 లక్షల వరకు అప్పు చేశాడని లత పేర్కొన్నారు. ఆ అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని.. భూమి అమ్మి అప్పు తీర్చాలని అనుకొన్నారు. కానీ భూమి పట్టా వారి పేరుతో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.

 పట్టా కోసం అప్పులు

పట్టా కోసం అప్పులు

పట్టా కోసం సురేశ్ అప్పుల పాలయ్యాడని గుర్తుచేశారు. పట్టా కోసం విజయారెడ్డికి కూడా సురేశ్ లంచం ఇచ్చానని తనతో చెప్పారని లత తెలిపారు. భూమి పట్టా కోసం సురేశ్ అప్పులు చేశాడని లత తెలిపారు. తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ పెరగడం.. భూమి మాత్రం సురేశ్ పేరు మీద రిజిష్ట్రేషన్ కాకపోవడంతో సమస్య తలెత్తింది. ఈ విషయమై విజయారెడ్డిని సురేశ్ బ్రతిమిలాడానని పేర్కొన్నారు.

వినని విజయ..?

వినని విజయ..?

విజయారెడ్డి వినిపించుకోకపోవడంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. తాను కూడా తనువు చాలించాడు. విజయారెడ్డిని కాపాడపోయిన డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డ సంగతి తెలిసింది. విజయారెడ్డి హత్య బాధ కలిగించిందని లత అన్నారు. తాను భర్తను కోల్పోయానని తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ భూముల లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
not murder threatening only.. but vijaya wont listen suresh wife latha told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X