వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగర్ మహాస్తూపంపై కేసీఆర్ చిత్రం.. యాదాద్రి ఘటనతో తొలగింపు .. అక్కడ కూడా శిల్పిదే తప్పా !!

|
Google Oneindia TeluguNews

యాదాద్రి లో దేవాలయ శిలలపై కెసిఆర్ , కారు, సర్కారు చిత్రాలని చెక్కి , గులాబీ ప్రచారం చేస్తుందన్న వార్తలు పెను దుమారం రేపాయి. ప్రతిపక్షాల మండిపడుతూ, పెద్ద ఎత్తున ఆందోళన కు పాల్పడడంతో యాదాద్రి ఆలయంలోని కెసిఆర్ తో పాటు, తెలంగాణ సర్కార్ ను ప్రతిబింబించే చిత్రాలను తొలగించారు. అయితే ఒక్క యాదాద్రి లో మాత్రమే కాకుండా, కెసిఆర్ చిత్రాలు నాగార్జునసాగర్ లో నిర్మాణ దశలో ఉన్న బుద్ధ వన మహా స్తూపం పైన కూడా చిత్రించారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ చిత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని కూడా తెలుస్తుంది.

హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కు రూ.27,165 జరిమానా వేసిన ట్రాఫిక్ పోలీసులు ... ఎందుకో తెలుసా ?హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కు రూ.27,165 జరిమానా వేసిన ట్రాఫిక్ పోలీసులు ... ఎందుకో తెలుసా ?

బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా కేసీఆర్ చిత్రం ..

బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా కేసీఆర్ చిత్రం ..

నాగార్జునసాగర్ లో నిర్మాణ దశలో ఉన్న బుద్ధ వన మహా స్థూపంపై తెలంగాణ సీఎం కేసీఆర్, బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా చిత్రాన్ని రూపొందించారు శిల్పులు. అయితే అది అంత ప్రాధాన్యత అంశంగా ఎవరు చూడలేదు. కానీ యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకార మండపంలోని రాతి శిలలపై చిత్రించిన సీఎం కేసీఆర్ చిత్రాన్ని, కారు గుర్తును, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆధ్యాత్మిక కేంద్రంలో , దైవ సంబంధమైన చిత్రాలు ఉండాలి కానీ , గులాబీ ప్రచారం కాదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ప్రతిపక్షాల నిర్ణయం తీసుకున్నాయి. ఇదే సమయంలో యాదాద్రి ఆలయంలోని కెసిఆర్ చిత్రాలను తొలగించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ప్రభుత్వం.

గోప్యంగా తొలగించిన చిత్రం .. యాదాద్రిలో శిల్పి ప్రేమతో చెక్కాడని సమర్ధించిన వైటీడీఏ

గోప్యంగా తొలగించిన చిత్రం .. యాదాద్రిలో శిల్పి ప్రేమతో చెక్కాడని సమర్ధించిన వైటీడీఏ

ఇక ఇదే క్రమంలో సాగర్ బుద్ధ వనంలో ఇచ్చిన సీఎం కేసీఆర్ చిత్రాలను సైతం గోప్యంగా తొలగించేలా చర్యలు తీసుకుంది. లేకుంటే ఇది మరో కాంట్రవర్సీ కి కారణమై ఉండేది. ఇక యాదాద్రి శిల్పాలు చేక్కతంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని , చెక్కేటప్పుడు శిల్పులకు స్వేచ్ఛ ఇచ్చామని . ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకున్న ప్రేమాభిమానాలతోనే ఓ శిల్పి ఆయన చిత్రాన్ని చెక్కారని చెప్పారు . వారంతా సీఎం గారిని ఒక దేవుడిలా చూస్తున్నారని, ఆయన వల్ల తమ కుటుంబాలు బతుకుతున్నాయని భావిస్తున్నారు.

బుద్ధ వనం మహా స్తూపంపై కూడా శిల్పి ప్రేమతో చెక్కారా అన్న ప్రశ్న

బుద్ధ వనం మహా స్తూపంపై కూడా శిల్పి ప్రేమతో చెక్కారా అన్న ప్రశ్న


అందుకే ఆయన చిత్రం చెక్కారు అని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి తెలిపారు. ఇక యాదాద్రి ఆలయం లో కేసీఆర్ చిత్రాన్ని శిల్పి ఇష్టంతో చెక్కితే మరి నాగార్జున సాగర్ బుద్ధవనంలో కేసీఆర్ చిత్రం ఎందుకు చేక్కారో అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇక బుద్ధ వనం మహా స్తూపంపై సైతం కేసీఆర్ బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తున్నట్టు చిత్రం చెక్కటం అక్కడ నిర్మాణం చేసిన శిల్పి కూడా ఇష్టంతో చెక్కారా ? లేదా సీఎం కేసీఆర్ కీర్తి కండూతితో తన చిత్రాన్ని చెక్కించేలా సూచించారా అన్న అనుమానం తాజా ఘటనతో వ్యక్తం అవుతుంది.

శిలలపై శిల్పాలు తర్వాత ... పాలన పై దృష్టి పెట్టాలని కోరుతున్న ప్రజలు

శిలలపై శిల్పాలు తర్వాత ... పాలన పై దృష్టి పెట్టాలని కోరుతున్న ప్రజలు

ఇక ఈ ఉదంతంతో కావాలనే ప్రభుత్వం యాదాద్రిలో సైతం వివాదాస్పదం అయిన ఆ చిత్రాలను చెక్కించి ఉంటుందన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఒక్క యాదాద్రిలో జరిగింది శిల్పి పొరబాటు అయితే సాగర్ బుద్ధ వనం లో కూడా జరిగింది శిల్పి పోరాబాటే అంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. శిలలపై శిల్పాలు చెక్కించుకోవటం పై కాకుండా ప్రజా సంక్షేమం , పాలనపైన కేసీఆర్ దృష్టి సారించాలని ఆశిస్తున్నారు తెలంగాణా ప్రజలు .

English summary
Not only in Yadadri but also the news that KCR paintings have been painted on the Stupa of Buddha Vanam Maha Stupa in Nagarjunasagar. However, it is also known that the images were deleted rather than pierced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X