• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమీ ఇవ్వలేదు.!ఇవ్వబోమని చెప్పడానికి అమీత్ షా వస్తున్నారా.?బీజేపి యువతను రెచ్చగొట్టొద్దన్న మంత్రి సబిత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయినప్పటి నుండి సీఎం చంద్రశేఖర్ రావు అన్ని రంగాలను ప్రగతిపథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేసారు. చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్దిని చూసి భరించలేక లేనిపోని నిందలు మోపుతున్నారని బీజేపి నేతలపై విరుచుకు పడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని సబిత ఎద్దేవా చేసారు.

టీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు అమీత్ షా సమాధానం చెప్పాలి.. మంత్రి సబిత డిమాండ్

టీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు అమీత్ షా సమాధానం చెప్పాలి.. మంత్రి సబిత డిమాండ్

పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అధ్యయనం చేసే అవకాశం బీజేపీ నేతలకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి.
మిషన్ భగీరథ నీళ్లు తాగి ఉంటారు, పల్లె ప్రకృతి వనాల్లో సేద తీరి ఉంటారని, 24 గంటల కరెంటుతో బీజేపి పాద యాత్ర ఇబ్బంది లేకుండా సాగి ఉండిఉండవచ్చని సబిత సెటైర్లు వేసారు. పాద యాత్రలో ప్రజలు చంద్రశేఖర్ రావు చేసిన మేలు గురించి సంజయ్ కు స్పష్టంగా చెప్పారని, బీజేపీ కార్యకర్త చనిపోతే ఆ పార్టీ ఆదుకోలేదు కానీ చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో ఇస్తున్న రైతు భీమా ఆదుకున్నదని ఓ మహిళ సంజయ్ కు చెప్పినట్టు సబిత గుర్తు చేసారు.

స్థానిక నేతలు చెప్పిన అబద్దాలు అమిత్ షా చెబితే ప్రజలు ఊరుకోరు.. స్పష్టం చేసిన సబిత

స్థానిక నేతలు చెప్పిన అబద్దాలు అమిత్ షా చెబితే ప్రజలు ఊరుకోరు.. స్పష్టం చేసిన సబిత

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరిగాయని ప్రజలు సంజయ్ ను నిలదీశారని, ఇప్పటికైనా సంజయ్ కు జ్ఞానోదయం అయ్యిందనుకుంటున్నామన్నారు సబిత. సంజయ్ కి బీజేపీ కి విధానాలు ముఖ్యం కాదని, విద్వేషాలే ముఖ్యమని నెల రోజుల పాదయాత్రలో చేసిన ప్రసంగాలు నిరూపిస్తున్నాయన్నారు మంత్రి సబిత. అమిత్ షా శనివారం రంగారెడ్డి జిల్లాకు వస్తున్నారని, తెలంగాణకు ఏం ఇవ్వలేదు, ఏం ఇవ్వబోము అని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా.?అని సబిత సూటిగా ప్రశ్నించారు. కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్ టూరిస్ట్ గా అమిత్ షా వస్తానంటే కుదరదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా అమిత్ షా చెప్పాలని సబిత డిమాండ్ చేసారు.

యువతను రెచ్చగొట్టొద్దు.. అమీత్ షా కి సబిత సలహా

యువతను రెచ్చగొట్టొద్దు.. అమీత్ షా కి సబిత సలహా

నవోదయ పాఠశాలలు తెలంగాణ కు ఇచ్చేది లేదు అని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా.?ఐఐటీ, ఐఐఎమ్, మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వబోమని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా.? విభజన చట్టం హామీలు అమలు చేసేది లేదని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా.?అని ప్రశ్నించారు. గ్యాస్ సీలిండర్ పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామని రేపటి సభలో ప్రకటించే సత్తా అమిత్ షా కు ఉందా అని సవాల్ విసిరారు. ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో ఉపయోగ పడే ఐటీఐఆర్ ను తెలంగాణ కు కేటాయిస్తున్నామని అమిత్ షా చెప్పగలరా అని సబిత ఇంద్రారెడ్డి నిలదీసారు.

రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చిందో షా చెప్పాలి.. పట్టుబట్టిన మంత్రి సబిత

రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చిందో షా చెప్పాలి.. పట్టుబట్టిన మంత్రి సబిత

అంతే కాకుండా అమిత్ షా శనివారం ఎం మాట్లాడుతారో తాము ఉహించగలమని, ఉరికే ఊక దంపుడు మాటలు మాట్లాడి వెళ్లిపోవడం కాదని, తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేసారు. విద్వేషాలు రెచ్చ గొట్టడానికి కాకుండా విధానాలు చెప్పడానికి అమిత్ షా రావాలన్నారు. బీజేపీ సభ పెట్టే తుక్కుగూడా పరిసర ప్రాంతాలు చూస్తే టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలుస్తుందన్నారు సబిత. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో సంజయ్ శ్వేత పత్రం విడుదల చేస్తే, మహేశ్వరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎం చేసిందో తాము శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు సబితా ఇంద్రారెడ్డి.

English summary
Amit Shah is coming to Rangareddy district on Saturday. Is Amit Shah coming to tell Telangana what was not given and what will not be given? Sabita asked directly. Sabita demanded that Amit Shah should not just come around as a political tourist and ask Amit Shah whether he should give national status to the Palamuru Rangareddy project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X