వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులరా.. జాగ్రత! తాగి డ్రైవింగ్ చేస్తే ఉద్యోగం ఊస్టే..!

|
Google Oneindia TeluguNews

''డ్రంకన్ డ్రైవ్ '' ఈపేరు చెబితే శని ఆదివారాల్లో వాహనాలు నడుపుతున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. వారాంతంలో కాస్త ఎంజాయ్ చేద్దామనుకునే ప్రతి వ్యక్తిని ఇలాంటీ డ్రంకన్ డ్రైవ్‌లు కలవరపరుస్తున్నాయి. దీంతో ఎక్కడ పోలీసులకు డ్రంకన్ డ్రైవ్ లో దొరుకుతామో అనే భయంతోనే చాలమంది రొడ్డు పైకి వస్తున్నారు. కొందరు ఎందుకొచ్చిన తంటా అంటూ బయట తాగి డ్రైవింగ్ చేయడానికి జంకుతున్నారు. మరికొంతమంది మాత్రం దొరికినప్పుడు చూద్దామని భావిస్తున్నారు. దీంతో ఎక్కడో ఓ చోట పోలీసులకు బుక్ అవుతున్నారు. అయినా డ్రంకన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు..దీంతో పోలీసులు వీటిపై మరిన్ని నిబంధనలు తెస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ పట్టుపడిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. వారు పట్టబడితే ఉద్యోగాలు ఊడుతాయని నోటిసులు పంపించన్నారు.

 డ్రంకన్ డ్రైవింగ్ చెకింగ్ లతో తాగుబోతులకు చెక్...

డ్రంకన్ డ్రైవింగ్ చెకింగ్ లతో తాగుబోతులకు చెక్...

హైదారాబాద్ తోపాటు రాష్ట్ర్రంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిబంధనలు తెచ్చారు. హైదరబాద్ లాంటీ నగరాల్లో తాగి వాహానాలు నడపడడం ద్వార పెద్ద ఎత్తున ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో పోలీసులు గత కొంత కాలంగా డ్రంకన్ డ్రైవింగ్ టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సెలవుకు ముందు రోజులతోపాటు సెలవురోజుల్లో ప్రతి చోట వాహానదారులకు డ్రంకన్ డ్రైవింగ్ చెస్తున్నవారికి చెక్ పెడుతున్నారు. అయినా ఈ కేసులు మాత్రం తగ్గకపోవడం ప్రతి రోజు ఏదో ఒక చోట డ్రంకన్ డ్రైవింగ్ పరీక్షలు చెస్తున్నారు.

డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుపడితే...కౌన్సిలింగ్ ,జరిమాన..కోర్టు శిక్ష

డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుపడితే...కౌన్సిలింగ్ ,జరిమాన..కోర్టు శిక్ష

కాగా ఇన్నాళ్లు డ్రంకన్ డ్రైవింగ్ లో పట్టుపడిన వారికి మొదటి సారిగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనంతరం పట్టుపడితే జరిమానా విధించి వదిలివేస్తున్నారు. మత్తు మోతాదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బండిని సీజ్ చేసి కోర్టుకు పంపుతున్నారు. అయినా... చాలమంది తాగి వాహానాలు నడిపే వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రతి రోజు ఏదో ఒక చోట డ్రంకన్ డ్రైవ్ చేసిన వారు పట్టుపడుతున్నారు. దీంతో పోలీసులు కొత్త నిబంధనకు తెరలేపారు. వాహానదారులపై మరింత పకడ్బంధిగా చర్యలు చేపట్టనున్నారు.

ఇక నుండి ఉద్యోగులపై నజర్....

ఇక నుండి ఉద్యోగులపై నజర్....

ఇందుకోసం ఇకనుండి డ్రంకన్ డ్ర్రైవ్‌లో పట్టుపడ్డ వాహానాదారులకు పై వాటితో పాటు కొత్తగా వాళ్ల ఉద్యోగాలపై దృష్టి పెట్టారు. తాగి పట్టుపడిన ప్రభుత్వ ,ప్రైవేట్ ఉద్యోగులకు నేరుగా వారి పై అధికారులకు నోటీసులు పంపించన్నారు. ఫలానా వాహనం నెంబర్ దారుడు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డాడు. అతను జరిమాన కూడ కట్టాడు. అంటూ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించనున్నారు. దీంతో ఉన్నతాధికారులు సైతం మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పలు నోటీసులు

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పలు నోటీసులు


కాగా ఇప్పటికే ఇలా రాష్ట్ర్రంలోని రోడ్లు భవనాల శాఖతోపాటు రెవెన్యూ ,విద్యుత్ ప్రభుత్వ ఉద్యోగుల కార్యలయాల ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి. దీంతో ఆయా కార్యాలయాల ముందు తాగి వాహనం నడపకూడదంటూ నోటీసులు దర్శనమిస్తున్నాయి. నోటీసులు అందిన నేపథ్యంలో వారి ఉద్యోగాలపై కూడ ప్రభావం పడే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ప్రైవేట్ ఉద్యోగులకైతే హెఆర్ రావాల్సిందే....

ప్రైవేట్ ఉద్యోగులకైతే హెఆర్ రావాల్సిందే....

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఉద్యోగుల బాస్ లకు నోటీసులు వెళతాయి. ఇంకొసారి పట్టుపడితే చర్యలు తీసుకోవాలని తెలుపుతారు.అయితే ప్రవైట్ ఉద్యోగులు మూడవసారి గనుక పట్టుపడితే నేరుగా హెఆర్ ను పిలిపించి మాట్లాడనున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో అటు ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగుల తోపాటు ప్రతి ఒక్కరు సహకరించాలని ,లేదంటే ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ప్రతి ఒక్కరు సహకరించే విధంగా నిబంధనలు

ప్రతి ఒక్కరు సహకరించే విధంగా నిబంధనలు

అయితే డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డ వారికి కేవలం కౌన్సిలింగ్‌లు, జరిమానాలు మరి ఎక్కువైతే జైలు శిక్షలు పడుతున్నాయి. తాజగా పోలీసులు వీటిపై మరిన్ని కఠినతరమైన నిబంధనలు తెస్తున్నారు. భవిష్యత్ లో డ్రంకన్ డ్రైవ్ పట్టుబడ్డ ప్రభుత్వ,ప్రయివేట్ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

English summary
if case book in drunk and driving, the governament and private employees will be given notices to thair higer officials, the hydarabad traffic police have alredy sent notices to givt employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X