వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్-కేసీఆర్‌కు చంద్రబాబు తోడు: కర్నాటకలో బీజేపీ-కాంగ్రెస్‌కు భారీ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తెలుగు రాష్ట్రాల నేతలు షాక్ ఇస్తున్నారు. వారు ప్రాంతీయ పార్టీలకు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామిలను కలిసి మద్దతు పలికారు. తెలుగు ఓటర్లు, రాష్ట్ర ప్రజలు జేడీఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు.

చదవండి: 'జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం, అక్కడ 18 స్థానాలు లక్ష్యం'

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేయనున్నారు. ఉత్తర కర్నాటకలో తెలుగు వారు ఎక్కువ. ఈ ప్రాంతంలో ఆయన ప్రచారం చేయనున్నారని జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. కేసీఆర్, పవన్ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా జేడీఎస్‌కు మద్దతు పలుకుతున్నారు.

చదవండి: కీలక నేతలతో అమిత్ షా భేటీ: గాలి జనార్ధన్ ముందు బెడిసికొట్టిన వ్యూహం?

వారిద్దరు నేరుగా, చంద్రబాబు పరోక్షంగా

వారిద్దరు నేరుగా, చంద్రబాబు పరోక్షంగా

కేసీఆర్, పవన్ కళ్యాణ్‌లు నేరుగా జేడీఎస్‌కు మద్దతు పలకగా,
చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేసిన పార్టీలకు కర్నాటకలోని తెలుగు ప్రజలు ఓటు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. విభజన సమయంలో కాంగ్రెస్, విభజన తర్వాత హామీల విషయంలో బీజేపీ ఏపీని మోసం చేసిందని టీడీపీ, చంద్రబాబు చెబుతున్నారు.

జేడీఎస్‌కు నేరుగా మద్దతు తెలపకపోవడానికి కారణం ఇదీ

జేడీఎస్‌కు నేరుగా మద్దతు తెలపకపోవడానికి కారణం ఇదీ

చంద్రబాబు నాయుడు జేడీఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలపకపోవడానికి కారణం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో బీజేపీ - జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది. ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంతోనే చంద్రబాబు బహిరంగ మద్దతు ప్రకటించలేదని అంటున్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉండదని జేడీఎస్ నేతలు చెబుతున్నారు.

జేడీఎస్ - బీజేపీ ప్రభుత్వం వస్తే

జేడీఎస్ - బీజేపీ ప్రభుత్వం వస్తే

సర్వేలు, కర్నాటకలో పరిస్థితులు చూస్తుంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. అప్పుడు జేడీఎస్ - బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, చెరో రెండున్నరేళ్లు పాలించే అవకాశం లేకపోలేదని టీడీపీ భావిస్తోందట. ఇప్పుడు జేడీఎస్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తే అది బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని భావిస్తున్నారట. అందుకే నేరగా మద్దతివ్వలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు ముగ్గురి దెబ్బ!

కాంగ్రెస్, బీజేపీలకు ముగ్గురి దెబ్బ!

మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్‌లు ప్రాంతీయ పార్టీకి మద్దతివ్వడం కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీలకు నష్టమే అంటున్నారు. పలు నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. జేడీఎస్‌కు మద్దతివ్వాలన్న తెలుగు నేతల ప్రకటన ఏ మేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది.

ఆ అపదవాదుకు దూరం

ఆ అపదవాదుకు దూరం

కాగా, కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటన చేశారు. తద్వారా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పరోక్షంగా టీడీపీ చెబుతోందని, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నాలు కూడా చేస్తోందని బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ అపవాదు నుంచి తప్పించుకొని, కాంగ్రెస్‌కు తమ మద్దతు లేదని చెప్పేందుకు పరోక్షంగానైనా జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా చంద్రబాబు పిలుపునిచ్చారని అంటున్నారు.

English summary
Following Telangana Chief Minister K. Chandrasekhar Rao, and Jana Sena chief Pawan Kalyan, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has now announced his support for Janata Dal (S) in the upcoming Karnataka Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X