హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: ఆస్ట్రేలియా నుంచి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలకు తెరతీస్తున్నాయి. తాజాగా నగరంలో మరో వివాహేతర సంబంధం వెలుగు చూసింది. డాక్టర్ పేరుతో మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటున్న వ్యక్తి గుట్టురట్టు చేశాడు ఓ ఎన్నారై భర్త. తన భార్యతో ఉన్న సదరు వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరి బాగోతం బయటపెట్టాడు.

ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న బీట్ ఆఫీసర్, వివాహేతర బంధమే కారణమా? అసలేం జరిగింది?ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న బీట్ ఆఫీసర్, వివాహేతర బంధమే కారణమా? అసలేం జరిగింది?

ఒకే ఆస్పత్రిలో..

ఒకే ఆస్పత్రిలో..

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నగరంలోని చైతన్యపురికి చెందిన శివప్రసాద్ బోడుప్పల్ ఆర్బీఎం ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో శివప్రసాద్ అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ లేడీ డాక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

భార్య వ్యవహారంపై అనుమానం

భార్య వ్యవహారంపై అనుమానం

ఆ లేడీ డాక్టర్ భర్త ఆస్ట్రేలియాలో ఉండటంతో వీరికి అడ్డు అదుపులేకుండా పోయింది. ఈ క్రమంలో లేడీ డాక్టర్ భర్తకు కొద్ది రోజుల క్రితం ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో తన భార్య వ్యవహారం గురించి ఆస్ట్రేలియా నుంచే ఆరా తీశాడు.

గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా..

గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా..

డాక్టర్ శివప్రసాద్‌తో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న ఆయన ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చాడు. తన భార్య శివప్రసాద్ ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. శివప్రసాద్ తోపాటు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరో జంటతో షాక్..

మరో జంటతో షాక్..

అయితే, పోలీసులు అదే ఇంట్లో మరో జంట కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శివప్రసాద్ అనుచరులు కొందరు అతడ్ని అరెస్ట్ చేసే సమయంలో మీడియాతో కొంత దురుసుగా ప్రవర్తించారు.

English summary
nri husband caught his wife red handedly with doctor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X