హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై భర్త నిర్వాకం: రమ్య శవాన్ని ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి భర్త మహంత్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. రమ్య అనే వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త మహంత్ ఫోన్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపాడు.

రమ్య మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలోనే రమ్య మృతదేహాన్ని వదిలి మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రమ్య పేరిట ఆస్ట్రేలియాలో సుమారు రూ. 2.5 కోట్ల బీమా చేసినట్లు సమాచారం.

పాస్‌పోర్టు ఉంటేనే బీమా వస్తుందని మృతురాలి బంధువులను డిమాండ్ చేసి పాస్‌పోర్టు తీసుకుని తిరుగుటపా కట్టాడని ఆరోపిస్తున్నారు. కాగా డబ్బు కోసమే రమ్యను భర్త మహంతే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో రమ్యకృష్ణ మృతి: భర్తే కారణమని ఆరోపణలుఆస్ట్రేలియాలో రమ్యకృష్ణ మృతి: భర్తే కారణమని ఆరోపణలు

NRI husband leaves Ramya Krishna dead body at Shamshabad airport

మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్‌ కూకట్‌పల్లి వాసి రమ్య వివాహం జరిగింది. రమ్య భర్త మహంత్‌ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు.

వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మహంత్ గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం రమ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

భార్య చనిపోతే బీమా వాయిదాలు కట్టాలని మహంత్ బాధపడ్డాడని రమ్య కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్య చనిపోతే రెండు వేల డాలర్లకు బాధపడ్డాడని వారన్నారు. భార్య కన్నా బీమా సొమ్మే అతనికి ముఖ్యమైందని అన్నారు.

English summary
A Hyderabad woman died in Australia in suspicious condition. Ramya family members are blaming her husband Mahanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X