వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణలో మంచి అధికారులే లక్ష్యం: బయటకొచ్చిన చంద్రబాబు కోడలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తామని, కేజీ టు పిజి వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, టిడిపి యువనేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి శుక్రవారం చెప్పారు.

శుక్రవారం ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణి మాట్లాడారు. పేద విద్యార్థుల కోసం గ్రూప్‌-1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. పలు ఉద్యోగాలకు 800 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పారు.

2005లో ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూళ్లు ప్రారంభించి గత పదేళ్లలో వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయని, పార్టీ కార్యకర్తల పిల్లల్లోనూ నైపుణ్య శిక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కృష్ణా, వరంగల్‌ జిల్లాలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ స్కూళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ ప్రతినిధి మాట్లాడుతూ... తెలంగాణలోని హైదరాబాదుతో పాటు ఆరు నగరాల్లో ప్రిలిమినరీ స్కీనింగ్ టెస్ట్, గండిపేటలో రెండో దశ పరీక్ష... ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణను అందిస్తామన్నారు. ప్రిలిమినరీ పరీక్ష వారి వారి దగ్గరి ప్రాంతాల్లోనే ఉంటుందన్నారు.

వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, జడ్చర్ల, నల్గొండలతో పాటు హైదరాబాద్.. ఈ ఏడు సెంటర్లలో ప్రాథమిక పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలు ఉంటాయన్నారు. గండిపేటలో రెండో దశ పరీక్షలు ఉంటాయన్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులను, వారి ఆర్థిక పరిస్థితులను సమన్వయం చేసి 800 మందిని ఎంపిక చేస్తామన్నారు.

దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విద్యా సంస్థలు నెలకొల్పుతామన్నారు. ప్రతి జిల్లాలో పాఠశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందిస్తామన్నారు. ఆయా ప్రాంతాలను బట్టి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

విలేకరులతో మాట్లాడటానికి ముందు నారా బ్రాహ్మిణి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యం.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తామని, కేజీ టు పిజి వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని బ్రాహ్మణి చెప్పారు.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

శుక్రవారం ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణి మాట్లాడారు. కాగా, బ్రాహ్మిణి పార్టీ కార్యాలయంలో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మంచి అధికారులను అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి చెప్పారు.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

2016లో కృష్ణా, వరంగల్ జిల్లాల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని బ్రాహ్మిణి చెప్పారు. భవిష్యత్తులో కేజీ టూ పీజీ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.

నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆరు వారాల పాటు కోచింగ్ ఇస్తామని నారా బ్రాహ్మిణి చెప్పారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా ఎంతోమందికి విద్యను అందించామని, జూనియర్ కళాశాలను ప్రారంభించామన్నారు.

 నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యా విభాగాన్ని మరింతగా విస్తృత పరుస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ సీవోవో మోహన్ రావు చెప్పారు.

English summary
Nara Brahmini on Friday announced free civils coaching for students from NTR Trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X