వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం .. మెనూ ఇదే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తో బాధ పడుతున్నవారు చికిత్స కోసం ఒకే గదిలో రెండు వారాలకుపైగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది . ఈ సమయంలో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారికి మందులతో పాటు మానసికంగా ధైర్యం చెప్పడం మాత్రమే కాదు సరైన పౌష్టిక ఆహారం కూడా ఇవ్వటం అత్యంత అవసరం . ఇక ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు.

ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!

కరోనా బాధితులకు చికిత్సలో నిరంతరాయంగా పని చేస్తున్న గాంధీ వైద్యులు

కరోనా బాధితులకు చికిత్సలో నిరంతరాయంగా పని చేస్తున్న గాంధీ వైద్యులు

గాంధీ ఆస్పత్రి కరోనా పాజిటివ్ కేసులతో ఇప్పుడు వారికి నిరంతరాయంగా అందిస్తున్న వైద్యంతో బిజీ బిజీగా ఉంది . గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 310 మంది పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఇప్పటికే పూర్తిగా కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారు 27 మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం ఐసీయూ, కరోనా పాజిటివ్‌ ఐసోలేషన్‌ వార్డుల్లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో 12 ఏళ్లలోపు పిల్లలు 20 మంది వరకు ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 200 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు.

ఇమ్యూనిటీ పెరిగేలా కరోనా బాధితులకు పౌష్టికాహారం

ఇమ్యూనిటీ పెరిగేలా కరోనా బాధితులకు పౌష్టికాహారం

ఇక కరోనా పాజిటివ్ అనగానే రోగి ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు . కరోనా బాధితులను ఐసోలేషన్ లో ఉంచటం వల్ల మరింత భయాందోళనకు గురవుతారు. ఇక ఈ సమయంలో రోగికి ఇమ్యూనిటీ చాలా అవసరం . రోగి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ముఖ్యమే కాబట్టి గాంధీ ఆస్పత్రిలో ఉన్న పాజిటివ్‌ వచ్చిన బాధితులకు వారి కోరిక మేరకు ఆహారం అందిస్తున్నారు. ఉదయం అల్పాహారంలో టిఫిన్‌, టీ అందజేస్తున్నారు. ఇందులో కొందరు ఇడ్లీ, దోశ, చపాతీ వంటివి ఆర్డర్‌ చేస్తుంటే, మరికొందరు పాలు, బ్రెడ్డు కావాలని కోరుతున్నారు. ఇక వారి కోరిక మేరకే వారికి అల్పాహారం అందిస్తున్నామని చెప్తున్నారు నోడల్ సెంటర్ ఇంచార్జ్ డాక్టర్ .రాజారావు .

బలవర్ధకమైన ఆహారం పెడుతున్నామని చెప్పిన నోడల్ సెంటర్ ఇంచార్జ్ రాజారావు

బలవర్ధకమైన ఆహారం పెడుతున్నామని చెప్పిన నోడల్ సెంటర్ ఇంచార్జ్ రాజారావు

రోగి ఏదీ కోరుకుంటే అదే ఆహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు .ఇక మధ్యాహ్నంఒంటి గంటకు లంచ్‌ అందిస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనంలో రెండు రకాల కూరలు, అన్నంతో సహా పెరుగు, ఉడకబెట్టిన కోడిగ్రుడ్డు , సాంబార్‌ ఇస్తున్నామని చెప్తున్నారు . సాయంత్రం బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌తో పాటు ఇతర పండ్లను ఆహారంగా అందజేస్తున్నామని వారికి పౌష్టికాహారం అందించాం చాలా అవసరం కాబట్టి వారికి వారిలో కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పెరిగేలా ఆహారం పెడుతున్నామని చెప్తున్నారు.

 మినరల్ వాటర్ బాటిల్స్ తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఆహారం అందజేత

మినరల్ వాటర్ బాటిల్స్ తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఆహారం అందజేత


రాత్రి డిన్నర్‌లో రైస్, చపాతీ అందజేస్తున్నారు . రోగికి దాహమేస్తే తాగేందుకు రోజుకు నాలుగు లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిళ్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు . ఆహారం అందించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రోగి నయం కావటానికి కావాల్సిన పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్తున్నారు . చికిత్స తో పాటు మానసిక స్థైర్యం పేషెంట్ లలో పెంచుతున్నామని , వారు కోలుకోవటానికి కావాల్సిన మందులతో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఆహారం కూడా అందిస్తున్నారు . మరణాల సంఖ్య పెరగకుండా వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారని నోడల్ సెంటర్ ఇంచార్జ్ రాజారావు పేర్కొన్నారు.

Recommended Video

Lockdown Extension Exit: Need To Balance Lives And Livelihood

English summary
The patient is attentive to coronavirus. Corona sufferers are even more fearful of being kept in isolation. Immunity is essential for the patient at this time. Only one medication is not enough for the patient to recover quickly. Nutrition is also important, so the positive patients in Gandhi Hospital are being fed according to their wishes with nutritious food .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X