వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలపై ఆందోళన: ఎన్వీఎస్ రెడ్డి వివరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు తగ్గించాలని బుధవారం ఆందోళన జరిగింది. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు కూడా బుధవారమే అందుబాటులోకి వచ్చింది.

Recommended Video

Hyd Metro smart card balance deducted automatically,Metro journey rules

హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలపై స్పష్టత: భారీ భద్రత హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలపై స్పష్టత: భారీ భద్రత

బుధవారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రోరైల్లో ఎక్కడానికి హైదరాబాద్ నగరవాసులు ఆసక్తి ప్రదర్శించారు. వందలమంది మెట్రోరైల్లో ప్రయాణించారు. మెట్రో రైలెక్కి ఫొటోలు, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.

మాకైతే సమాచారం లేదు: మెట్రో ప్రారంభంపై బాంబుపేల్చిన మంత్రి కేటీఆర్ మాకైతే సమాచారం లేదు: మెట్రో ప్రారంభంపై బాంబుపేల్చిన మంత్రి కేటీఆర్

ధరలపై అసంతృపి

ధరలపై అసంతృపి

మెట్రో రైలు ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నగరవాసులు ధరల విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మెట్రో ధరలు తగ్గించాలని కాంగ్రెసు డిమాండ్‌ చేసింది.

ఆందోళన చేస్తాం...

ఆందోళన చేస్తాం...

అధికంగా మెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌ అన్నారు. మెట్రో ఆలస్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని, పెరిగిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు.

చార్జీలపై వివరణ

చార్జీలపై వివరణ

మెట్రో రైలు చార్జీలపై మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. చార్జీలు ఎక్కువగా ఏమీ లేవని, కేంద్ర చట్టం నిబంధనల మేరకే ఉన్నాయని ఆయన బుధవారం స్పష్టం చేశారు.మెట్రో రైల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన అన్నారు. సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద భారత ప్రభుత్వం టికెట్ ధరలను నిర్ణయింస్తుందని చెప్పారు

మొదటి రోజు లక్ష మంది...

మొదటి రోజు లక్ష మంది...

మెట్రో రైలులో మొదటి రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో సరదాగా ప్రయాణించాలనుకున్న వారు 20 శాతం వరకు ఉంటారని ఎన్వీఎస్‌ అన్నారు. హైదరాబాద్ ప్రజలు క్రమశిక్షణ గలవారని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు.

హడావిడి వద్దు...

హడావిడి వద్దు...

రైలు ఎక్కేప్పుడు దిగేప్పుడు హడావుడి పడవద్దని ఎన్వీఎస్ రెడ్డి ప్రయాణికులను కోరారు. రైల్లో వృద్దులకు, మహిళలకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంకా కొన్ని సాంకేతిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు మొదటిరోజు ఎనిమిది నిమిషాలకు ఒక రైలు, అలాగే అమీర్‌పేట నుంచి నాగోల్‌ వరకూ 15 నిమిషాలకు ఒకసారి రైళ్లు నడిచినట్లు ఆయన తెలిపారు.

రైళ్లు ఇలా...

రైళ్లు ఇలా...

భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు ఉంటుందని, మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ కంపల్సరీ కాదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రత తో మెట్రో ప్రయాణాలు చేయవచ్చునని త్వరలో మెట్రో పాసులను కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

పార్కింగ్‌కు నెల రోజులు...

పార్కింగ్‌కు నెల రోజులు...

పార్కింగ్ పనులు పూర్తి అవడానికి నెల సమయం పడుతుందని, ఇంకా పార్కింగ్ ధరలు నిర్ణయించలేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు, మొత్తం 24 స్టేషన్లలో 12 స్టేషన్లలో పార్కింగ్ స్థలాలున్నట్లు తెలిపారు. 2018 జూన్ వరకి 66 కిమీల మూడు కిమీల కారిడార్ పూర్తి చేస్తామని, మూడు కారిడార్లు 2018 జూన్ వరకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. రెండు మూడు స్టేషన్లలో చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించామని ఆయన చెప్పారు.

English summary
Hyderabad metro rail MD NVS Reddy clarified on mmetro rail charges and said that charges are not high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X