హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: ఎన్వీఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగర అభివృద్ధిలో మెట్రో ఎంతో కీలకమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన మీట్‌దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పీపీపీ పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో అని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వెల్లడించారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలోనే మెట్రో స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, అనుకున్న గడువులోపు మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
స్థల సేకరణ కోసం జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు రూ.620 కోట్ల నిధులు ఇచ్చామని, మరో రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

హైదరాబాద్‌

మెట్రో విస్తరణకు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మియాపూర్‌ - పటాన్‌చెరు, ఫలక్‌నుమా - శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, తార్నాక - ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నాగోల్‌ - మెట్టుగూడ మధ్య 8 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయన్నారు. ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నందునే నాగోల్‌ - మెట్టుగూడ మధ్య సర్వీసులు ప్రారంభించలేదని ఆయన అన్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 269 ఎకరాల భూమి సేకరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వివరించారు.

English summary
Hyderabad Metro rail MD NVS Reddy on Saturday explained about Metro rail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X