వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోయిన ఆక్టోపస్ పోలీసులు .. ఫుల్లుగా తాగి ఓ హోటల్ లో వీరంగం

|
Google Oneindia TeluguNews

శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన , ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ? ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఎవరైనా మద్యం సేవించి వాహన నడిపితేనే వారి పరువు అంతా తీసి కేసులు పెడుతున్న పోలీసులు, తాగి నానా హంగామా చేసి పోలీసు వ్యవస్థ పరువు బజారున పెడుతున్న వారి పై దృష్టి సారించడం లేదు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగులూరు గేట్ సమీపంలో మద్యం సేవించి ఆక్టోపస్ పోలీసులు సృష్టించిన వీరంగం నేపథ్యంలో ప్రజలు పోలీసుల తీరుపై అసహనంతో ఉన్నారు.

<strong>చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో 6 వేలకు పైగా ఇళ్ళ రద్దు జీవో జారీ</strong>చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో 6 వేలకు పైగా ఇళ్ళ రద్దు జీవో జారీ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే బొంగులూరు గేట్ సమీపంలోని మన రుచులు హోటల్ లో ఆక్టోపస్ పోలీసులు తాగి నానా హంగామా చేశారు. నిన్న రాత్రి 11 గంటల 20 నిమిషాల సమయంలో మంగల్ పల్లి గ్రామానికి చెందిన రామ్ అనే వ్యక్తి హోటల్ లో భోజనం చేస్తుండగా అతనిని దుర్భాషలాడారు. అంతేకాకుండా తాము పోలీసులమని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు సుమారు 16 మంది పోలీసులు రాము, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ఇష్టారాజ్యంగా కొట్టారు.ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదు అన్నట్లుగా ప్రవర్తించడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

 octopus police drank and created nuesense in a hotel

ఇక బాధితుడు రామ్ చెప్పిన వివరాల ప్రకారం రాత్రి 11.30 ని,ల నుండి దాదాపు 12.గం,ల వరకు తనను తన స్నేహితుడు కృష్ణను చితకబాదారు అని, తనను కొడుతుంటే అడ్డం వచ్చిన స్నేహితుని సైతం వదలలేదని వారు వాపోయారు. తాగిన మైకం లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని పేర్కొన్న బాధితులు 16 మంది అక్టోపాస్ పోలీస్ లపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై సీఐ నరేందర్ వివరణ కోరినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. దీంతో సామాన్యులకు ఒక న్యాయం, పోలీసులకు మరో న్యాయమా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Octopus police drank and created nuesense at mana ruchulu hotel near the Bonguloru Gate. Ram, a man from Mangal Palli village, was abused and beaten by the octopus police last night. About 16 policemen attacked two men, Ramu and Krishna, and beat them .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X