• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అధికారుల టిక్ టాక్ పిచ్చి .. శానిటేషన్ కు బదిలీ .. అయ్యిందమ్మా శాస్తి

|

ఇప్పుడు దేశ వ్యాప్తంగా టిక్ టాక్ మేనియా పెరిగిపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఏం చేసినా తమలో ఉన్న టాలెంట్ మాత్రం టిక్ టాక్ వీడియోలలో చూపిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఏదో టైం పాస్ కి చేసే ఈ టిక్ టాక్ వీడియోలను ప్రభుత్వోద్యోగులు పని మానేసి మరీ చేస్తే ఎలా ఉంటుంది. టిక్ టాక్ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో తిక్క పనులు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు మరి.

ఖమ్మం కార్పోరేషన్‌ లో హల్ చల్ చేసిన అధికారుల టిక్ టాక్ వీడియోలు

ఖమ్మం కార్పోరేషన్‌ లో హల్ చల్ చేసిన అధికారుల టిక్ టాక్ వీడియోలు

ఖమ్మం కార్పోరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి, టిక్ టాక్‌లో టాలెంట్ చూపిస్తున్న విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. డ్యాన్సులు, డైలాగ్ లతో పాటు టిక్ టాక్ యాప్ లో వీడియోలు ఆప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్న అధికారుల తీరుపై గత కమిషనర్ కూడా కొందరిని హెచ్చరించారు. మరి కొందరికి నోటీసులు ఇచ్చారు. అయినా అక్కడి సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు కనిపించటం లేదు. కార్పొరేషన్లో శానిటేషన్ పనులు , రోడ్ల పనులు , జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు కోసం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి మాత్రం తాము బిజీ బిజీగా ఉన్నామంటూ ఘాటుగా సమాధానం చెబుతూ టిక్ టాక్ లతో బిజీ అయిపోయిన అధికారులకు చుక్కలు చూపించే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.

బదిలీ చేసి ఫీల్డ్ వర్క్ ఇచ్చి తిక్క కుదిర్చిన కమీషనర్

బదిలీ చేసి ఫీల్డ్ వర్క్ ఇచ్చి తిక్క కుదిర్చిన కమీషనర్

వారి టిక్ టాక్ తిక్క కుదర్చటానికి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు. సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు వారి సెక్షన్లను మార్చారు. ఆ తరువాత కూడా వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో, ఈ వీడియోలు చేసిన అందరినీ శానిటేషన్ విభాగానికి మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏసీ రూముల్లో టిప్ టాప్ గా టిక్ టాక్ చేసే వాళ్ళు... ఇక శానిటేషన్ లో నాలుగు రోడ్లు శుభ్రం చేయిస్తూ బిజీ

ఏసీ రూముల్లో టిప్ టాప్ గా టిక్ టాక్ చేసే వాళ్ళు... ఇక శానిటేషన్ లో నాలుగు రోడ్లు శుభ్రం చేయిస్తూ బిజీ

గత కొంత కాలంగా కార్పొరేషన్ ఉద్యోగులు టిప్ టాప్ గా తయారై వచ్చి, ఏసీ రూమ్ లలో కూర్చుని టిక్ టాక్ వీడియోలను తీసుకుంటూ, విధులను పక్కన పెట్టిన వారంతా ఇప్పుడు పోలోమని పొద్దున్నే లేచి నగర వీధుల శుభ్రతపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పారిశుద్ధ కార్మికులతో పని చేయిస్తూ నగర పరిశుభ్రత కోసం నాలుగు రోడ్లు తిరగాల్సి ఉంది. మొత్తానికి టిప్ టాప్ గా రెడీ అయ్యి టిక్ టాక్ లతో హల్ చల్ చేసే వారు ఇక ఆఫీసుల్లో కూర్చునే సుఖానికి స్వస్తి చెప్పాల్సి వస్తుంది . నాలుగు రోడ్లు తిరిగి వీధుల్ని శుభ్రం చేయించాల్సి వుంది. డ్రైనేజ్ లు ,చెత్త కుండీలు శుభ్రత అన్నీ ఇక వారి అండర్ లోనే .. మొత్తానికి కమీషనర్ అధికారుల టిక్ టాక్ పిచ్చి కుదిర్చే నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారు .

English summary
Sections and departments of employees of Khammam corporation, outsourcing staff, have been shifted to sanitation section . Criticizing the lack of discipline among staff, the tik tok officers who have taken action have changed their sections. and all those who have made videos have been ordered by the top authorities to switch to the sanitation department.corporation employees have been sitting in the AC rooms, taking tik tok videos, and all those who are busy with the task of getting up and focusing on the cleanliness of the city streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X