వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో రైల్‌తో చేతులు కలిపిన ఓలా! ఇక రాకపోకలు మరింత ఈజీ!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇక మెట్రో ప్రయాణికులు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారిక యాప్‌ 'టీ-సవారీ' ద్వారా ఓలా క్యాబ్‌లు, ఆటో లు బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ వాలెట్, ఓలా మనీ సేవలనూ వినియోగించుకోవచ్చు.

Recommended Video

Hyderabad Metro : HYD మెట్రో తరువాతే ఏదయినా ! ఎందుకో తెలుసా ? | Oneindia Telugu

నగరవాసులకు మెట్రో జర్నీతోపాటు చివరి గమ్యం చేర్చేందుకు ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్, ఓలా సంస్థల మధ్య బుధవారం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.

 ఓలా మనీ యాప్‌ ద్వారా స్మార్ట్‌కార్డుల రీచార్జ్‌...

ఓలా మనీ యాప్‌ ద్వారా స్మార్ట్‌కార్డుల రీచార్జ్‌...

మెట్రో రైలు స్టేషన్ల సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓలా జోన్లు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో రైలు దిగగానే క్యాబ్‌ల కోసం మెట్రో ప్రయాణికులు నిరీక్షించే అవసరం ఉండదు. అంతేకాదు, మెట్రో రైల్, ఓలా మధ్య జరిగిన ఒప్పందంతో ఓలా మనీ యాప్‌ ద్వారా మెట్రో స్మార్ట్‌కార్డులను రీచార్జ్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది.

 ఆ స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లు...

ఆ స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లు...

నగరంలోని మియాపూర్, అమీర్‌పేట్, నాగోల్, కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ నాలుగు స్టేషన్లే కాకుండా ఇతర స్టేషన్లలోనూ త్వరలో ఓలా కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

 పార్కింగ్ సమస్యకూ పరిష్కారం...

పార్కింగ్ సమస్యకూ పరిష్కారం...

మొబైల్ ఫోన్‌లో ఓలా యాప్‌ లేని మెట్రో ప్రయాణికులు స్టేషన్ల వద్దనున్న ఓలా కియోస్క్‌లను సంప్రదించి అక్కడ ఉండే ప్రతినిధుల సహకారంతో క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇక మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్యకూ ఓలా జోన్స్‌ పరిష్కారం చూపుతాయట. ఫలితంగా ప్రయాణికుల ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందట.

ఓలా స్మార్ట్‌ మొబిలిటీ సేవలు...

ఓలా స్మార్ట్‌ మొబిలిటీ సేవలు...

ఓలా సంస్థ ఇటీవలే గుర్‌గావ్, బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు మెట్రోస్టేషన్లలో ఓలా కియోస్క్‌లు ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఈ సేవలు హైదరాబాద్ మెట్రోకు కూడా అందుబాటులోకి వచ్చాయి.
నగర రవాణా రంగ చరిత్రలో మెట్రో తో కొత్త శకం ప్రారంభమైందని ఓలా డైరెక్టర్‌ సౌరభ్‌ మిశ్రా తెలిపారు. ఓలా స్మార్ట్‌ మొబిలిటీ సేవలను రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. సులభమైన, సౌకర్యవంతమైన, క్లిష్టతలేని ప్రయాణాన్ని మెట్రో ప్రయాణికులకు అందించేందుకే ఈ భాగస్వామ్యం చేసుకున్నామని వివరించారు.

సులువైన, సౌకర్యవంతమైన సేవలు...

సులువైన, సౌకర్యవంతమైన సేవలు...

నాగోల్‌-మియాపూర్‌(30 కి.మీ.) మెట్రో మార్గం 2.4 లక్షల ప్రయాణికుల మార్కును అధిగమింనట్లు ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ సైనీ తెలిపారు. ఓలాతో ఒప్పందం ద్వారా ప్రయాణికులకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ తేలికవుతుందన్నారు. ఓలా భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మొబిలిటీ అనుభవాలను అందిస్తుందన్నారు.

English summary
Cab aggregator Ola has announced a strategic partnership with Larsen & Toubro Metro Rail Hyderabad Limited (LTMRHL). The move aims to bolster a multi-layer association and offer first and last mile connectivity solutions to metro commuters. Under this partnership, the ride-hailing startup has been on-boarded as the ‘Mobility Partner’ of the metro rail project. Anil Kumar Saini, Chief Operating Officer, LTHMRL said, “The inauguration of 30 km of Hyderabad metro rail from Nagole to Miyapur has been successful with the ridership reaching a record 240K recently. We are happy to collaborate with Ola as our mobility partner. Now commuters will have uninterrupted connectivity to and from the metro stations.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X