హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన సీబీఎస్ బస్టాండ్, 80ఏళ్లకుపైగా సేవలందించి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గౌలిగూడలోని పాత బస్టాండ్‌(సీబీఎస్‌) పైకప్పు గురువారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. అయితే ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

Recommended Video

మరికొద్ది రోజుల్లో అదృశ్యం కానున్న బస్టాండ్ CBS may disappear soon : All You Need To Know| Oneindia

బస్టాండ్ షెడ్ కూలిపోయే స్థితిలో ఉన్నట్లు నాలుగు రోజుల క్రితమే అధికారులు గుర్తించారు. దీంతో ముందస్తు చర్యగా అధికారులు బస్సులను లోపలికి అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున భారీ శబ్దంతో షెడ్ కుప్పకూలింది.

80ఏళ్లకుపైగా చరిత్ర

80ఏళ్లకుపైగా చరిత్ర

88 సంవత్సరాలు(1930 నుంచి)గా సీబీఎస్‌ బస్టాండ్ ప్రయాణికులకు సేవలందించింది. ఉమ్మడి రాష్ట్రాల తొలి బస్‌స్టేషన్‌గా పేరు గడించింది. బస్టాండ్‌లో మొత్తం 36 ఫ్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక, ఇతర రాష్ట్రాల ప్రయాణికులు కూడా ఈ బస్టాండ్ నుంచే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు.

ఎంజీబీఎస్ నిర్మాణం తర్వాత..

ఎంజీబీఎస్ నిర్మాణం తర్వాత..

కాగా, నిజాం కాలంలో నిర్మాణం జరిగిన గౌలీగూడ పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి రాకపోకలు జరపకుండా ఖాళీగా ఉంచారు అధికారులు. ఇమ్లిబన్ బస్టాండ్(ఎంజీబీఎస్) నిర్మించిన అనంతరం బస్సులను అక్కడకు మార్చారు. కాగా, బస్సుల అవసరాల కోసం పాతబస్టాండ్‌కు మరమత్తులు చేసి సిటీ బస్సులకు అనుమతినిచ్చారు.

ముందస్తు అప్రమత్తతో..

ముందస్తు అప్రమత్తతో..

అయితే నాలుగు రోజుల క్రితం బస్టాండ్ పూర్తి శిథిలావస్థకు చేరుకుందని, ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సిటీ బస్సులను, ప్రయాణికులను అందులోకి అనుమతించలేదు. ఆర్టీసీ అధికారులు ఊహించిన విధంగానే.. గురువారం తెల్లవారుజామున షెడ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్ధంతో కుప్పకూలడంతో అక్కడున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.

పునర్నిర్మించాలి..

పునర్నిర్మించాలి..

పురాతనమైన బస్టాండ్ కుప్పకూలిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు తరలివస్తున్నారు. ఆ బస్టాండ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం తిరిగి ఈ బస్టాండ్‌ను పునర్నిర్మించాలని వారు కోరుతున్నారు. కాగా, సీబీఎస్ బస్టాండ్ నిర్మాణానికి వాడిన ఇనుము(మిస్సిసిపీ హ్యాంగర్)ను అప్పట్లోనే అమెరికా నుంచి తెప్పించుకోవడం గమనార్హం.

English summary
The age old CBS Hanger popularly known as Mississippi Hanger at Gowliguda collapsed in the morning hours of Thursday. There were no casualties as the authorities had closed down the bus station for the last five days seeing the dilapidated condition of the bus station which was being used for the last 85 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X