వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటి నుంచి గెంటేస్తే ఈ రాజయ్య బతుకిలా అయింది

ఇంటి నుంచి గెంటేయడంతో ఓ వృద్ధుడు దిక్కు మొక్కు లేనివాడయ్యాడు. అతను పార్కుకు ఆనుకుని ఉన్న షెడ్డులో బతుకీడుస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : కొడుకు సరిగా చూసుకోకపోగా ఇంటి నుంచి గెంటి వేయడంతో ఓ వృద్ధుడు ఇక్కట్ల పాలై హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ను ఆనుకొని ఉన్న షెడ్డులో ఉంటూ బతుకీడుస్తున్నాడు. ఆకలితో పోరాటం చేస్తూ చేరదీసే వాళ్లు లేక అచేతన స్థితిలో కొట్టుమ్టిడుతున్నాడు. కన్నీిని కనురెప్పల మాటున అదిమి పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నాడు.కొడుకు ఆర్టీసీలో కండక్టర్‌ (హుజూరాబాద్‌ డిపో) ఉద్యోగి అయినా మానవత్వానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.

వివరాల్లోకి వెళితే... హసన్‌పర్తి మండల పరిధిలోని పెంబర్తి గ్రామంలో మండల రాజయ్య (65) జీవనం సాగించేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉండగా చదివించి పెళ్లిళ్లు చేసి ఉన్నత స్థానంలో నిలబ్టెాడు. కొడుకు ఆర్టీసీ కండక్టర్‌ ఉద్యోగి. అయితే రాజయ్య భార్య సుగుణ మూడేళ్ల క్రితం మరణించింది. తనకున్న పొలంను పిల్లలకు అప్పజెప్పాడు. ఇక్కడ నుంచి రాజయ్యకు కష్టాలు చుట్టుమ్టుాయి.

Old man thrown out of house lives in a shed

రేకుల షెడ్డే ఆయన జీవనం...

కన్న కొడుకు రాజయ్యను కాదని బయటకు గెంటేశాడు. దీంతో ఆయన ఉన్న ఊరును వదిలి రోడ్డెక్కాడు. హన్మకొండకు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురికాగా, కాలు విరగడంతో 108ద్వారా ఎంజీఎంకు స్థానికులు తరలించారు. మూడు నెలలు వైద్యం పొందినప్పికీ ఎవ్వరు ఎంజీఎం వైపు తొంగి చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నా సేవలన్నీ ఎంజీఎం వాళ్లు చూసుకున్నారన్నాడు.

ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక పబ్లిక్‌ గార్డెన్‌కు ఆనుకొని ఉన్న రేకుల షెడ్స్‌ 95 నెంబరులో కాలం వెళ్లదీస్తున్నాడు. అక్కడే యాచిస్తూ జీవనం సాగిస్తున్న తనకు రాత్రి వేళలో పోలీసులు, మరోపక్క కుక్కల పాట్లు తప్పడంలేదని కన్నీి పర్యంతమయ్యాడు. తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటున్న నేటి పరిస్థితుల్లో ఆదరించిన కొడుకులు ఇలాిం వారు సమాజంలో ఉండటం కలవరపరుస్తోంది. అనాథగా మిగిలిన తనకు అండగా ఉండాలని, ఆప్తులు, స్వచ్ఛంద సంస్థలు చేయూత ఇవ్వాలని రాజయ్య కోరుతున్నాడు.

English summary
An old man Rajaiah has been thrown out his house by his son, is living under a shed at Warangal in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X