వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: స్థానికులకే ఉద్యోగాలు, ‌ఒమన్‌లో ఇండియన్లకు చిక్కులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గల్ప్ దేశాల్లో ఇక ఉద్యోగాలు చేయాలనుకొనే వారి ఆశలపై ఒమన్ ప్రభుత్వం చిక్కులు కల్పించింది. సుమారు 87 రంగాల్లో పలు ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకే అవకాశాలు కల్పించాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల నుండి గల్ప్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్ళే వారికి నిరాశను మిగిల్చింది.

ట్రంప్ తీపి కబురు: మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డులు, ఇండియన్లకు లాభమేట్రంప్ తీపి కబురు: మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డులు, ఇండియన్లకు లాభమే

ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను ఒమన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగించనున్నట్టు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఉపాధి కోసం ఇతర దేశాల నుండి వలసవచ్చినవారు పోటీ పడడం స్థానికులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం వంటి పరిణామాలతో మస్కట్(ఒమన్)ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

గల్ఫ్ దేశాల్లో 20 లక్షల మంది ఇండియన్స్

గల్ఫ్ దేశాల్లో 20 లక్షల మంది ఇండియన్స్

గల్ప్ దేశాల్లో 20 లక్షల మంది భారతీయులు ఉన్నారని ఓ అంచనా. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి కూడ ఉపాధి కోసం వెళ్ళే వారి సంఖ్య గణనీయంగానే ఉంది.తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 4.75 లక్షల మంది గల్ప్ దేశాల్లో పనిచేస్తున్నారని అంచనాలు వెల్లడిస్తున్నాయి భవన నిర్మాణ రంగంలో, కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా గల్ప్ దేశాల్లో పనిచేస్తుంటారు ఇండియా నుండి గల్ప్ దేశాలకు వలసలు పెరగడంతో స్థానికుల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అక్కడి ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో 87 రంగాల్లో ఉద్యోగావకాశాలను స్థానికులకే ఇవ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

 ఉద్యోగాల కోసం స్థానికుల డిమాండ్

ఉద్యోగాల కోసం స్థానికుల డిమాండ్

కీలకమైన రంగాల్లో కూడ విదేశాల నుండి వచ్చినవారే ఉద్యోగాలు చేస్తుండడంతో స్థానికులు ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో ప్రభుత్వం 87 రకాలైన ఉన్నత ఉద్యోగావకాశాలను స్థానికులకే ఇవ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ కారణంగా విదేశాల నుండి వలస వచ్చినవారికి ఉద్యోగావకాశాలపై తాత్కాలికంగా ఆశలు వదులుకోవాల్సిందే.

 6 నెలల నిషేధం

6 నెలల నిషేధం

ప్రొఫెషనల్ రంగాల్లోని ఉద్యోగాలను స్థానికులకే తొలుత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంలో విదేశీయులకు ఉపాధి కల్పించకూడదనే ఉద్దేశ్యంతో నిషేధం విధిస్తూ ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది వైద్యం, మార్కెటింగ్‌, ఎయిర్‌పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్‌ , మీడియా రంగాల్లో విదేశీయులకు ఉద్యోగావకాశాలపై 6 మాసాల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకొంది.

స్వదేశీయులకే పెద్దపీట

స్వదేశీయులకే పెద్దపీట

గతంలో కంటే భిన్నంగా గల్ప్ దేశాలు నిర్ణయాలు తీసుకొంటున్నాయి. స్థానికంగా చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా అక్కడి ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకొంటున్నాయి. ఉద్యోగావకాశాల్లో స్థానికులకే పెద్దపీట వేయాలని నిర్ణయానికి వచ్చాయి. వలస వెళ్ళినవారికి తక్కువగా ఉపాధి అవకాశాలను కల్పించేలా అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. ఏదైనా సంస్థలో స్థానికుల సంఖ్య ఎక్కువగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకొంటున్నారు.

English summary
A six-month ban on hiring expat workers in 87 job roles was recently imposed by the Ministry of Manpower.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X