హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron: దక్షిణాఫ్రికా వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అలర్ట్, రేపు కీలక భేటీ, ఆంక్షలు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొత్తి వేరియంట్‌ ఓమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు ఆదివారం సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం అలర్ట్

ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం అలర్ట్


ఇదే అంశంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు.

హరీశ్ రావు భేటీ.. కొత్త వేరియంట్‌పై చర్చ

హరీశ్ రావు భేటీ.. కొత్త వేరియంట్‌పై చర్చ

ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్ వచ్చేవారిని ట్రేసింగ్, టెస్టింగ్ సహా పలు అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో మంత్రి హరీశ్ రావు చర్చించనున్నారు. కాగా, అంత‌ర్జాతీయ ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్తవేరియంట్ బాధితుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై పలు మార్గర్శకాలను విడుదల చేయనుంది. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు కరోనా డోసులు తీసుకుని ఉండాలని.. మార్గర్శకాలను పాటించాలని ఆంక్షలు విధించింది. చెన్నై విమానాశ్రయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారు.

హైదరాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్

హైదరాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించి, నిఘాను కట్టుదిట్టం చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌ల దేశాల్లో ఇప్పటికే వేరియంట్ కనుగొనబడిన దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికులను నిశితంగా పర్యవేక్షించడానికి, క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బృందాలు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలోని ఆరోగ్య బృందాలు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల పరిచయాలు నిశితంగా ట్రాక్ చేయబడతాయి, పరీక్షించబడతాయి. కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిప్తోంది. మళ్లీ గత ఏడాది పరిస్థితులు తీసుకొస్తుందా? అని ఆందోళన చెందుతున్నాయి.

English summary
Omicron Covid Variant: Telangana On High Alert, Surveillance Beefed Up At Hyderabad Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X