వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధునిక భ్యాగనరానికి రూపశిల్పి ఇతడే, ఆయన చనిపోయి నేటీకి 50 ఏళ్ళు

ఆధునిక భాగ్య నగరానికి అంకురార్పణ చేసిన ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చనిపోయి నేటికీ 50 ఏళ్ళు. 1967 లో ఆయన కింగ్ కోఠిలోని ప్యాలెస్ లో నిమోనియాతో చనిపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ చేసిన వ్యక్తి ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన సరిగ్గా ఇదే రోజు చనిపోయారు. ఏడో నిజాం నవాబు కాలంలోనే ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ జరిగింది.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయంలో మంచి పనులు కూడ జరిగాయి. అయితే ఆయన హయంలోనే అనేక అరాచకాలు చోటుచేసుకొన్నాయని విమర్శకులు వాదిస్తుంటారు.

On his 50th death anniversary, Hyderabad’s last Nizam is a forgotten king

నిజాంను వ్యతిరేకించేవారు ఆయన హయంలో చోటుచేసుకొన్న చెడ్డ పనులను మాత్రం ఎత్తిచూపుతుంటారు.అయితే అయితే ఆయన హయంలో ప్రజలకు ఉపయోగపడే పనులు కూడ చోటుచేసుకొన్నాయి. ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ చేసింది ఏడో నిజాం నవాబే.

నిమోనియా వ్యాధితో కింగ్ కోఠిలోని ప్యాలెస్ లో 1967 ఫిబ్రవరి 24వ, తేదిన ఏడో నిజాం నవాబ్ చనిపోయాడు. అయితే ఆయన కోసం మస్జీద్ ఈ జుడి అనే సమాధిని నిర్మించారు.ఈ సమాధి కూడ పట్టించుకొనేవారు లేకుండా పోయారు.

ఏడో నిజాం నవాబు కాలంలోనే హైద్రాబాద్ లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, నిజామ్ ఆసుపత్రి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీనదిపై నయాపూల్ వద్ద వంతెనను నిర్మించారు.

బేగంపేట విమానాశ్రయం, నిజాం స్టేట్ రైల్వేస్, ఆజం జాహీ టెక్స్ టైల్స్ మిల్లు, హైకోర్టు భవనం, అసెంబ్లీ భవనం, నాంపల్లి రైల్వేస్టేషన్, జూబ్లీహల్ లాంటి భవనాలు ఏడో నిజాం నవాబు హయంలోనే నిర్మాణాలు జరిగాయి.

English summary
Mir Osman Ali Khan, the seventh and last Nizam of the princely state of Hyderabad, died on this day 50 years ago. Half-a-decade later, the city has forgotten its last “monarch”, who is considered the architect of modern Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X