వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ పై రగులుతున్న రాష్ట్రం..! అరెస్టులు, నిర్భందాలతో అట్టుడుకుతున్న తెలంగాణ..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇంటర్ పై రగులుతున్న రాష్ట్రం..! అరెస్టులతో అట్టుడుకుతున్న తెలంగాణ..!! || Oneindia Telugu

హైదరాబాద్‌: ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జనసమితి, టీటీడిపి పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంటర్‌ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. టీటీడిపి అద్యక్షుడు యల్ రమణను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 అరెస్టులు, నిర్బంధం..! రణరంగాన్ని తలపిస్తున్న రాష్ట్రం..!!

అరెస్టులు, నిర్బంధం..! రణరంగాన్ని తలపిస్తున్న రాష్ట్రం..!!

తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటాన్ని ఉత్తమ్‌, కోదండరామ్‌, చాడా వెంకట్‌రెడ్డి ఖండించారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలతో తెల్లవారుజామున 4 గంటలకే జూలకంటి ఇంటికి చేరుకున్న పోలీసులు, ఆయనను హౌజ్‌ అరెస్టు చేసి నిర్బంధించారు.

 అరెస్టులపై పొన్నం మండిపాటు..! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలు..!!

అరెస్టులపై పొన్నం మండిపాటు..! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలు..!!

ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేపడుతుండటాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అరెస్టులు కాదు విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.

ఇంటర్‌ పోరు తీవ్రతరం..! పలు రాజకీయ నేతలు ముందస్తు అరెస్టులు..!!

ఇంటర్‌ పోరు తీవ్రతరం..! పలు రాజకీయ నేతలు ముందస్తు అరెస్టులు..!!

ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు ముందస్తుగానే సన్నద్ధమయ్యారు. మరోవైపు ఇంటర్‌ బోర్డు కార్యాలయం నినాదాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల శ్రేణులు ప్రయత్నించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

లక్ష్మణ్ వినూత్న దీక్ష..! అప్రమత్తమైన పోలీసులు..!!

లక్ష్మణ్ వినూత్న దీక్ష..! అప్రమత్తమైన పోలీసులు..!!

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణలో ఇంటర్‌ మంటలు చల్లారడం లేదు. ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు ముందస్తుగానే సన్నద్ధమయ్యారు.

English summary
The Telangana state was struck by the siege of collectorates and inter board. The Opposition Congress, all parties has been protesting against the injustice done to the students in Telangana. The day before the collectorate of 31 districts in the state was concerned. The Congress rangers tried to break into the inter board on this occasion and the police blocked them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X