వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోకిరి అరెస్ట్: 'ప్రేమిస్తున్నా, నీవు పెళ్ళి చేసుకోవద్దు', యువతికి వేధింపులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గతంలో ఓ యువతితో పరిచయంతో తీసుకొన్న ఫోటోను ఆధారంగా వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పెళ్ళి చేసుకోవాలని భాదితురాలిని వేధింపులకు గురిచేశాడు. ఆ యువతికి కాబోయే భర్తకు కూడ ఫోటోలను పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఎట్టకేలకు నిందితుడిని శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ కు చెందిన ముస్తఫా అనే యువకుడితో ఓ యువతితో పరిచయం ఉంది. ఈ పరిచయం కారణంగా గోల్కొండ కోటలో ముస్తఫాతో ఆ యువతి ఫోటోలు దిగింది. తరచూ ఫేస్ బుక్ లో ఆ యువతితో నిందితుడు చాటింగ్ చేసేవాడు.ఫోన్ లో మాట్లాడేవాడు.

అయితే కొంత కాలం తర్వాత ముస్తపా తనలోని మరో రూపాన్ని చూపాడు. ఆ యువతిని పెళ్ళి చేసుకొంటానని ఫేస్‌బుక్ లో చాటింగ్ లో కోరేవాడు. కానీ ఆ యువతి మాత్రం తిరస్కరించింది. అయినా వేదింపులను మాత్రం ఆపలేదు.

ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్

ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్

ముస్తఫాతో ఆ యువతి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ లో అప్ లోడ్ చేసేవాడు. తనకు మరోకరితో వివాహం నిశ్చయమైందని ఆ యువతి ప్రాధేయపడినా కానీ, అతడు వినలేదు. ఆ యువతి ఫోటోలను ఫేస్ బుక్ లో అప్‌లోడ్ చేయడమే కాకుండా ఆ యువతి వివాహం చేసుకోనున్న వ్యక్తికి కూడ తనతో ఆ యువతి దిగిన ఫోటోలను నిందితుడు పంపాడు. యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ప్రేమలో ఉన్నాం పెళ్ళి చేసుకొంటాం

ప్రేమలో ఉన్నాం పెళ్ళి చేసుకొంటాం

తామిద్దరం ప్రేమించుకొంటున్నాం, ఆ అమ్మాయిని వివాహం చేసుకొంటానని ముస్తఫా యువతికి కాబోయే భర్తకు ఫోటోలు పంపి మరీ చెప్పాడు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోకూడదని కోరాడు. రోజు రోజూకు ముస్తపా వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

ముస్తఫాపై పోలీసుల నిఘా

ముస్తఫాపై పోలీసుల నిఘా

యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముస్తఫాపై నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నిఘా ఆధారంగా పోలీసులు ముస్తఫాను ఎక్కడ ఉన్నాడో గుర్తించి అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్క్ వద్ద ముస్తఫాను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతులను వేధిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు

యువతులను వేధిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు


ముస్తఫా సంజీవయ్య పార్క్ వద్ద మరికొందరితో కలిసి యువతులను వేధిస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు ముస్తఫా ఉపయోగించే సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. యువతులను వేధిస్తున్న ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
A young woman approached the “SHE Teams” with a complaint of social media harassment. She stated that one Mustafa Khan sent her a friend request through Face book. Later she met him at Golconda fort along with her friends took pictures together there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X