వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూకేస్తున్నా అంటూ బెదిరింపు.. ఫ్లై ఓవర్‌పై యువకుడి హల్‌చల్...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మిట్ట మధ్యాహ్నం .. ఆ రహదారి నిర్మానుష్యంగా ఉంది. ఇంకేముంది ఫ్లై ఓవర్ పైనుంచి దూకాలని ప్రయత్నించాడో యువకుడు. కానీ అక్కడున్న జిమ్ సిబ్బంది పరిస్థితిని గమనించారు. అతడు సూసైడ్ చేసుకుంటున్నాడని గమనించి వాయువేగంతో స్పందించారు. వెంటనే ఫ్లై ఓవరు కింద కొందరు, ఇద్దరినీ ఫ్లై ఓవర్‌ పైకి పంపించి అతడి ప్రాణాలు కాపాడారు. కట్ చేస్తే అతన్ని సురక్షితంగా కాపాడి, భోజనం పెట్టించి, ఇంటికి పంపించారు. ఇదీ సినిమానో, రియాలిటీ షోనో కాదు .. అత్తాపూర్ ఫ్లై ఓవర్ మీద జరిగిన యదార్థ గాధ.

one man threating to people

వెంటనే స్పందించిన జిమ్ సిబ్బంది
అత్తాపూర్ 125 నంబ్ పిల్లర్ వద్ద ఓ యువకుడు దూకేందుకు ప్రయత్నించాడు. వెంటనే చూసిన జిమ్ సిబ్బంది అలర్టయ్యారు. బృందాలుగా విడిపోయారు. కొందరు కింద యువకుడిని దూకొద్దని బెదిరిస్తున్నారు. ఇంతలో మెరుపులాంటి ఇద్దరూ ఫ్లై ఓవర్ పైకెళ్లి.. చాకచాక్యంగా అతన్ని పట్టుకున్నారు. వెంటనే తమ టూ వీలర్ మీద జిమ్ వద్దకు తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగిందని ఎందుకిలా చేశావని ఆరాతీశారు. అయితే అతని సమాధానం విని ఖంగుతిన్నారు. ఫ్లై ఓవర్ పైనుంచి దిగితే మోడీ స్కార్పియో ఇస్తాడని పేపర్‌లో చదివానని చెప్పడంతో ఆశ్చర్యపోరయారు. తర్వాత మాట్లాడితే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మతిస్థిమితం ఉందని నిర్ధారించారు. తనకు ఆకలిగా ఉందంటే భోజనం పెట్టించారు. తినేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతను ఉత్తరభారతదేశానికి చెందిన వాడని జిమ్ నిర్వాహకులు తెలిపారు.

ఫ్లై ఓవర్ పైనున్న యువకుడిని చూసి జిమ్ సిబ్బంది వెంటనే స్పందించారు. తమ కుర్రాళ్లు అతడిని సేవ్ చేశారు. లేదంటే అతను పైనుంచి దూకి చనిపోయేవాడు. సాధారణంగా పోలీసులకు చెప్తాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి సీరియస్ దృష్ట్యా వారే రంగంలోకి దిగారు. అంతేకాదు సినిమాల్లో చూపించినట్టు పోలీసులు .. సమయానికి రావడం ఆరుదు. అత్తాపూర్ ఘటనలో కూడా ఫిర్యాదు చేసి ఊరుకుంటే ఓ నిండు ప్రాణం బలై ఉండేది. కానీ ఇక్కడ జిమ్ నిర్వాహకులు స్పందించి కాపాడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

English summary
A young man tried to jump at the Attapur 125 Namb Pillar. The gym staff immediately became alarmed. Split into groups. Some are threatening not to jump under the young. Meanwhile, like lightning, the two fly over and catch him. They were immediately brought to the gym on their two-wheeler. What happened after that, they asked. His answer, however, was denied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X