వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదురుతోన్న వివాదం: 'జబర్దస్త్, ఆది'లపై మరో ఫిర్యాదు.. 'రేటింగ్స్ ఉంటే మీ ఇష్టమా?'

ఆదిపై అనాథ శరణాలయాల పిల్లలు, మహిళల సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నారు.

|
Google Oneindia TeluguNews

కామారెడ్డి: ఈటీవిలో ప్రసారమవుతున్న వివాదాస్పద కామెడీ షో 'జబర్దస్త్'పై మరో ఫిర్యాదు నమోదైంది. అనాథ పిల్లలను కించపరిచేలా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై కొంతమంది అనాథ యువతులు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సోమవారం ఫిర్యాదు చేశారు.

Recommended Video

Jabardasth Hyper Aadhi Issue : Opinion

పంచ్ డైలాగుల పేరుతో అనాథ పిల్లలను, వికలాంగులను, వృద్దులను, మహిళలను కించపరుస్తున్నారన్న ఆరోపణలు జబర్దస్త్ పై వెల్లువెత్తుతున్నాయి. హాస్యం పేరుతో ఫక్తు బూతును జనాల మైండ్ లోకి జొప్పిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అనాథ పిల్లలపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోను ఆది, జబర్దస్త్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

అనాథలపై ఆది డైలాగులు ఇవి:

అనాథలపై ఆది డైలాగులు ఇవి:

జబర్దస్త్ లోప్రదర్శించిన అనాథ శరణాలయం స్కిట్‌లో భాగంగా.. అనాథ పాత్రధారి రైజింగ్ రాజు 'నన్ను చిన్నప్పుడు చెత్త కుండీలో పడేశారు' అంటాడు. దీనికి బదులిస్తూ.. ' నీలాంటి వాడిని చెత్త కుండీలో కాకుండా తిరుపతి హుండీలో వేస్తారా..?' అంటూ హైపర్ ఆది వ్యాఖ్యానించాడు.

 మరో డైలాగ్ లో ఇలా:

మరో డైలాగ్ లో ఇలా:

అదే స్కిట్ లో అనాథలను ఉద్దేశించి.. 'వీళ్లు అనాథల్లా లేరు.. పదికీ పాతికకు పీకలు కోసేలా ఉన్నారు. వీళ్లు అనాథలేంటి?' అని హైపర్ ఆది వ్యాఖ్యానించాడు.

ఇక మరో డైలాగ్ లో.. 'అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారు' అని తీవ్ర వివాదానికి తెరదీశాడు. అనాథ పిల్లలను అక్రమ సంబంధాలతో ముడిపెట్టడం మాట్లాడటంతో ఆదిపై అనాథ శరణాలయాల పిల్లలు, మహిళల సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నారు.

రేటింగ్ ఉంటే

రేటింగ్ ఉంటే

హైపర్ ఆదిని ఎవరు ప్రశ్నించినా.. తమ 'షో'కు ఐదేళ్ల నుంచి రేటింగ్ ఉందని చెబుతున్నాడు. అయితే చాలామంది దీనికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. పోర్న్ వీడియోలకు కూడా హయ్యెస్ట్ వ్యూయర్‌షిప్ ఉంటుందని, అంతమాత్రాన అవి ప్రజలకు మేలు చేసేవని అనుకుంటే అంతకుమించిన పొరపాటు లేదని గుర్తుచేస్తున్నారు. కేవలం వ్యూయర్‌షిప్ ఆధారంగా జనామోదాన్ని పరిగణించడం తప్పనేది చాలామంది భావన.

అనసూయ వివాదం:

అనసూయ వివాదం:

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆ సినిమాలో తల్లిని కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని అనసూయ ఆరోపించారు. టీవి9 ఛానెల్ లో దానిపై గట్టిగానే స్పందించారు. అలాంటిది అనాథలను కించపరిచినా సరే.. కామెడీని కామెడీలా తీసుకోవాలంటూ జనాలకు సలహా ఇస్తున్నారు. దీంతో అనసూయ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు జబర్దస్త్ జడ్జిలు నాగబాబు, రోజాలపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 మహేష్ కత్తి:

మహేష్ కత్తి:

మహేష్ కత్తి చాలామందికి సినిమా వ్యక్తిగానే తెలుసు కానీ ఆయనలో తొలి నుంచి సామాజిక, రాజకీయ కోణాలున్నాయి. చాలా సామాజిక సమస్యలపై ఆయన బహుజన దృక్పథంతో స్పందించారు. అటు ప్రజా సంఘాలతోను ఇటు సినిమాలతోను ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది.

మహేష్ కత్తిపై హైపర్ ఆది పరోక్షంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనాథ బాలలకు మద్దతుగా నిలిచారు.

English summary
Another case was filed against popular and controversial comedy show Jabardast. Orphan children filed case on Hyper Adi and Nagababu, Roja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X